తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా చేసేందుకు టీటీడీ కొత్త చైర్మన్ చేస్తున్న ప్రయత్నానికి కారాచరణ ప్రారంభమయింది. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని గురువారం నంచి అమలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీని వారం రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే ఈ నెల 24న జరగనున్న పాలకమండలిలో ఆమోదం లభించనుంది.
గంటలోపే దర్శనం చేయించడానికి మొదటగా వారి ఆధార్ కార్డు నంబర్, ఫేస్ రికగ్నేషన్ రసీదు ఇస్తారు. అందులో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ అందిస్తారు. ఈ టోకెన్ తీసుకున్న సందర్శకులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్‌లో స్కానింగ్ అనంతరం క్యూ లైన్లోకి పంపుతారు. గంట సమయంలోపే స్వామివారి దర్శనం పూర్తవుతుంది.
ఈ టోకెన్ల జారీకి దాదాపు 45 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సిబ్బందితో పని లేకుండా ఎఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయనున్నారు. ఈ విధానం అమలుకు ఎఐ సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి ద్వారా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం సక్సెస్ అయితే భక్తులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే క్యలైన్లను మెయిన్ టెయిన్ చేయడమే కాకుండా.. వీఐపీలను ఎంతగా నియంత్రిస్తే.. అంతగా భక్తులకు సరైన సేవలు అందే అవకాశం ఉంది.