ఏఆర్ డెయిరీ పేరుతో నెయ్యి సప్లయ్ కాంట్రాక్టు తీసుకున్నారు. ఆ డెయిరీకి కాంట్రాక్ట్ దక్కడానికి చేయాల్సినంత అక్రమాలు చేశారు. టెండర్ రూల్స్ మార్చేశారు. దశాబ్దాలుగా నెయ్యి సరఫరా చేస్తున్న నందిని బ్రాండ్ ను పక్కన పెట్టేశారు. చివరికి తాము చీప్ గా తయారు చేస్తున్న నెయ్యిని తీసుకొచ్చి టీటీడీకి ఇచ్చారు. వారు భక్తులకు పంచేశారు. ఇంతకీ ఆ నెయ్యి ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేశారో ఎవరికీ తెలియదు.
ఎఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా చేసేంత సామర్థ్యం లేదు. ఆ కంపెనీ నుంచి వచ్చే నెయ్యి కూడా అంతంతమాత్రమే. తిరుపతిలో ఉండే ఓ డెయిరీకి చెందిన ట్యాంకర్ల నుంచి మిగతానెయ్యి వస్తుంది. అసలు ఆ నెయ్యి కాంట్రాక్ట్ ఏఆర్ డెయిరీదే అయినా… అసలు సప్లయర్ మాత్రం వైసీపీ లీడర్. ఏఆర్ డెయిరీతో కుమ్మక్కు అయిపోయి.. ఇలా దోపిడీకి మార్గం సుగమం చేసుకున్నారు. ఆ తెర వెనుక నెయ్యి సప్లయర్ కూడా టీటీడీలో కీలక వ్యక్తి కాబట్టి టెస్టులు చేయించేసినట్లుగా నటించి… మిగతా పని పూర్తి చేశారు.
ఇప్పుడు సిట్ విచారణలో అన్నీ బయటకు వస్తున్నాయి. వైష్ణవి డైరీ అనే చిన్న కంపెనీ ట్యాంకర్లలో నెయ్యితిరుమలకు వస్తోంది. ఈ కంపెనీ నెయ్యిని ఎందుకు తీసుకుంటున్నారు ?. గతంలో తాము తిరస్కరించామని చెప్పిన ట్యాంకర్ల నెయ్యిని మళ్లీ అదే ట్యాంకర్లతో ఎలా తీసుకొచ్చారు… ఇవన్నీ సిట్ విచారణలోతేలే అంశాలు. అసలు నెయ్యి సప్లయర్ ఎవరో.. ఆ నెయ్యిని ఎక్కడి నుంచి తెస్తున్నారో సిట్ బయటపెడుతుంది. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వస్తుంది.