తిరుమల ఇప్పటి వరకూ శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రంగానే అందరికీ పరిచితం.. ఇక నుంచి ఆ తిరుమల.. హనుమాన్ క్షేత్రం కూడా. ఎందుకంటే.. తిరుమలలోని అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాజని తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆధారాలతో సహా శ్రీరామనవమి నాడు ప్రకటించింది. శ్రీవారి ఏడు కొండల్లో అంజనాద్రి ఒకటి. అక్కడే హనుమంతుడు జన్మించాడని.. పండితులు సుదీర్ఘ పరిశోధనలు చేసి తేల్చారు. జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ఈ విషయాన్ని తిరుమలలో అదికారికంగా ప్రకటించారు.
ఆంజనేయుడి జన్మస్థానం అంజనాద్రినే అన్నదానికి కొన్ని ఆధారాలు ఉండటంతో టీటీడీ ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ లోతుగా పరిశోధన చేసింది. ఖచ్చితమైన ఆధారాలను సేకరించింది. నాలుగు నెలల పాటు సాగిన అన్వేషణలో శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో ఆధారాలు సేకరించాారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడని… సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరాడని ఆధారాలు సేకరించారు. 12 పురాణాలు ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని చెబుతున్నాయన్నారు. 12, 13 శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉందని తేల్చారు.
అయితే కర్ణాటకలోని హంపీలో అంజనేయుడు పుట్టాడని ఇప్పటికే పరిశోధనకు తేల్చారు. అలాగే చత్తీస్గడ్లోనూపుట్టారని కొంత మందిపరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు టీటీడీ…అంజనాద్రిలో పుట్టారని క్లెయిమ్ చేసుకోవడంతో వివాదాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే.. వివాదాలు ఎలా ఉన్నా.. ఇక నుంచి తిరుమలోని అంజనాద్రి కూడా.. ప్రత్యేకంగా భక్తులతో కిటకిటలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించే ఆలోచన చేయవచ్చని అంచనా వేస్తున్నారు.