తిరుపతిలో ఓ పరిశ్రమను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకున్న ఓ నేత వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. పోలీసుల్ని అడ్డు పెట్టుకుని మాఫియా తరహాలో పరిశ్రమల్ని బెదిరించాలనుకున్న ఆ లీడర్ తీరు కేంద్రం వద్దకు చేరింది. కేంద్రం కూడా సీరియస్ కావడంతో ఆయనతో కలిసి మాఫియాగా మారిన పోలీసు అధికారులు ఇరుక్కుపోయారు. ఈ వ్యవహారం పోలీసు వర్గాల్లో సంచలనం రేపుతోంది.
తిరుపతిలో ఓ పరిశ్రమ స్క్రాప్ ను చెన్నైకి తరలిస్తూ ఉంటుంది. అది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ. అయితే ఓ లీడర్ .. ఆ పరిశ్రమను బెదిరించి..తమకు యాభై లక్షలు ఇవ్వాలని లేకపోతే స్క్రాప్ ను తరలించలేవని హెచ్చరించారు. ఆ ఫ్యాక్టరీ ప్రతినిధులు లైట్ తీసుకున్నారు. దీంతో ఆ లీడర్ .. పోలీసుల్ని పురమాయించి వారి లారీలను తనిఖీల పేరుతో ఆపేశారు. ఆ కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న తమ యాజమాన్యానికి తెలిపారు. వారు కేంద్రంలో ఉన్న పెద్దలకు సన్నిహితులు. ఏపీలో జరుగుతున్న అరాచకం గురించి తమ సన్నిహితులకు చెప్పారు.
దాంతో కేంద్ర పెద్దలు అనంతపురం డీఐజీకి గట్టి వార్నింగ్ పంపించారు. దీంతో డీఐజీ ఉన్న పళంగా తనిఖీల పేరుతో ఆ లారీలను ఆపిన వారిని అనంతపురం పిలిపించుకున్నారు. ఇప్పటికి నాలుగురోజులుగా వారిని అనంతపురంలోనే ఉంచి ప్రశ్నిస్తున్నారు. లీడర్ దందాకు సహకరించేందుకు ఏ మాత్రం ఆలోచించని పోలీసులు ఇప్పుడు రిస్క్ లో పడిపోయారు.
తిరుపతిలో డబ్బులు వసూలు చేయడానికి పోలీసుల్ని సైతం వాడుకుంటున్న ఆ లీడర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. తిరుపతి ఎస్పీ తమ మాట వినడం లేదని చాలా మంది టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. మరి ఈ లీడర్ ఎవరు అనేది బయటకు తేలాల్సి ఉంది.