ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగానికి 2025 అత్యంత కీలకం. గత ప్రభుత్వం పదేళ్ల పాటు చేసిన విధ్వంసం కారణంగా ఎవరూ రియల్ ఎస్టేట్ గురించి.. ఆస్తుల విలువ గురించి ఆలోచించలేదు. అందరూ ప్రభుత్వం మారిన తర్వాత అనే ఆలోచనకు వచ్చారు. వారి ఆలోచనకు తగ్గట్లుగా ప్రభుత్వం మారింది. మార్పు కూడా ప్రారంభమయింది. అయితే అది ర్యాపిడ్ గా ఉండే ఏడాది మాత్రం 2025.
విశాఖను టెక్ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కీలక దశకు చేరుకుంటున్నాయి. గూగుల్ కంపెనీ అతి పెద్ద పెట్టుబడిని ప్రకటించింది. ఆ పెట్టుబడి గ్రౌండ్ అయితే విశాఖకు మహర్దశ వచ్చేసినట్లే. బోగాపురం ఎయిర్ పోర్టు ఈ ఏడాది దాదాపుగా పూర్తి అవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఎయిర్ పోర్టు ప్రారంభానికి ముందే దాని వల్ల జరిగే అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు, మౌలిక వసతులు కల్పించేందుకు రంగం సిద్దం చేస్తోంది.
ఇక అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. భవిష్యత్ లో కూడా ఎవరూ అమరావతి జోలికి రాకుండా చూసేలా పనులు జరగనున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభమయింది. పనులు కూడా జరుగుతాయి. ఏడాదిలో అనూహ్యమైన మార్పు కనిపించనుంది. అదే సమయంలో ప్రైవేటు కంపెనీలు కూడా పనులు ప్రారంభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కూడా జరగనుంది.
ఇక తిరుపతి కూడా రాయలసీమలో మెట్రో సిటీగా మారే చాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికి తిరుపతి అధ్యాత్మిక నగరంగా తన ప్రత్యేకత నిలుపుకుంటూనే ఇండస్ట్రీస్ రంగంలో .. ఎలక్ట్రానిక్ హబ్ గా మారుతోంది. ఉపాధి కేంద్రంగా మారుతూండటంతో అక్కడా రియల్ ఎస్టేట్ ఊహించనంతగా పెరగబోతోంది.