తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల మూడ్ పీక్స్‌కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి… ఏపీలో తిరుపతి లోక్‌సభకు ఉపఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్ మార్చి ఏడో తేదీన విడుదల కానున్న ఢిల్లీలోని అత్యున్నత వర్గాలు చెబుతున్నాయి. ఖాళీ అయిన ఆరు నెలలలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రకారం చూసినా.. మార్చి మొదటి వారంలో ప్రక్రియ ప్రారంభిస్తే సమయానికి పూర్తవుతుంది. మార్చి ఏడో తేదీనే ఎందుకంటే… ఆ రోజున… ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, అసోం , కేరళల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు పర్యటనలు చేయడం ఆయన స్టైల్. ఇప్పుడు అది జరుగుతోంది. ఆయన ఎక్కడెక్కడ సభలునిర్వహించాలో ..నిర్వహించేసిన తర్వాత ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఐదేళ్ల క్రితం మార్చి నాలుగో తేదీన విడుదల చేశారు.
ఈ సారి ఏడో తేదీన విడుదల చేయవచ్చని ప్రధాని మోడీనే స్వయంగా ప్రకటించారు. ఆయన మాటను జవదాటే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఒక రోజు అటు ఇటుగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. వాటితో పాటు తెలుగు రాష్ట్రాల ఉపఎన్నికల షెడ్యూల్ కూడా ఖాయంగానే విడుదల చేస్తారు. మరోసారి దేశంతోపాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతాయి.