అధికారంతో ప్రతిపక్షాల్ని ఎంతలా వేధించవచ్చో చూపించడానికి వైసీపీ నేతలు ఎప్పుడూ రెడీగా ఉంటారు. వారెదో పుట్టుకతో అధికారంలో ఉండి.. పోయే వరకూఅధి అధికారంలో ఉంటారన్నట్లుగా వారి తీరు ఉంటుంది. తాజాగా పవన్ కల్యాణ్ ప్రధాని మోడీతో భేటీ అవడానికి విశాఖలో ఎదురుచూస్తున్న సమయంలో తిరుపతిలో ఆ పార్టీ కీలక నేత కిరణ్ రాయల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ కూడా నిబంధనలకు విరుద్ధంగా నోటీులేమీ ఇవ్వకుండా.. ఇంట్లో వాళ్లను ఎక్కడిక్కడ తలుపులు మూసి .. కిరణ్ రాయల్‌ను తీసుకెళ్లారు. ఏం కేసు.. ఏం కథ అనేది చెప్పలేదు.
తలుపులు ఎలాగోలా తీసుకుని కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తాము తీసుకెళ్లలేదని చెప్పారు. చివరికి నగరి పోలీసులు అరెస్ట్ చేశారని.. తనపై అసభ్య కామెంట్లు చేశారని మంత్రి రోజా ఫిర్యాదు చేశారని అందుకే అరెస్ట్ చేశారన్న సమాచారం తెలిసింది. రోజా మాట్లాడే మాటలతో పోలిస్తే కిరణ్ రాయల్ పద్దతిగానే మాట్లాడతారు. అయినా కేసులు పెట్టినా.. అరెస్టులు చేసినా దానికో పద్దతి ఉంటుంది. ఏపీలో అదేమీ కనిపించదు.
కిరణ్ రాయల్ అరెస్ట్ చేయడానికి సమయం కూడా పవన్, మోదీ భేటీ అయిన టైమ్ చూసి అరెస్ట్ చేయడం… వైసీపీ నాయకత్వం వికృత మనస్థత్నానికి నిదర్శనం అనేది ఎక్కువ మంది చెప్పేమాట. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేని పరిస్థితి. కిరణ్ రాయల్ తిరుపతిలో జనసేన పార్టీకి పిల్లర్‌గా ఉన్నారు ప్రతీ అంశంపై వైసీపీపై విరుచుకుపడుతూ ఉంటారు. ఆయన అక్రమ అరెస్ట్ జనసేన వర్గాల్లో అలజడి రేపుతోంది.