తన ఫోన్ డేటాను చోరీ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేసారు. జనసేన లీగల్ టీం తో కలిసి ఆయన పోలీసుకు పలు వివరాలు అందించారు. రెండు రోజులుగా తనపై ఆరోపణలకు చేసిన వారి కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ బయటకి తీసి, ఎవరెవరితో మాట్లాడారో బయటకి తీయాలని విజ్ఞప్తి చేశారు. నా గోంతు నొక్కాలని వైసిపి నేతలు, వారి సోషియల్ మిడియా చేస్తున్న పనులపై ఫిర్యాదు చేశానుని తెలిపారు.
గత ఏడాది జనవరిలో రోజా ఫిర్యాదు మేరకు కిరణ్ రాయల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఫోన్లు అప్పుడే స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న డేటాను వైసీపీ నేతలు కాపీ చేసుకున్నారు. వాటితో బెదిరించడం ప్రారంభించారు. ఆ సమయంలో కిరణ్ రాయల్ హైకోర్టులో కేసు కూడా వేశారు. అప్పట్లో పలువురుకి నోటీసులు కూడా హైకోర్టు జారీ చేసింది. ఇపుడు ఆ డేటాతో కిరణ్ రాయల్ ను టార్గెట్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2013 లో జరిగిన ఆర్థిక లావాదేవీలను ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం వైసిపి కే చెల్లిందన్నారు. ఈ వ్యవహారంపై మా లీగల్ టీం హై కోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నామని.. నాపై కక్ష కట్టి ఒక మహిళను అడ్డం పెట్టుకొని లేనిపోని ఆరోపణలు చేస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి బెదిరింపులతో నా గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని చేసిన నేను ఏ తప్పూ చేయలేదని.. అన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.