తిరుపతి జిల్లా పారిశ్రామీకరణ పరంగా ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా స్పెషల్ ఎకనమిక్ జోన్ సెజ్‌లు ఉన్న జిల్లాగా తిరుపతి నిలిచింది. తిరుపతి జిల్లాలో మొత్తం ఎనిమిది సెజ్‌లు ఉన్నాయి. అందులో భారీ పరిశ్రమల నుంచి చిన్నతరహా పరిశ్రమల వరకూ పెద్ద ఎత్తున కొలువై ఉన్నాయి.
శ్రీసిటీ సెజ్ దేశంలోనే అత్యంత విజయవంతమైన సెజ్‌లలో ఒకటిగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఇక్కడ తమ ప్లాంట్లనుపెట్టాయి. అలాగే తిరుపతి జిల్లాలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ రెండు ఉన్నాయి. ఈ రెండింటికి సెజ్ హోదా ఉంది. ఇక మాంబట్టులో ఉన్న సెజ్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. నాయుడుపేట సెజ్, సీసీఎల్ సెజ్, అపాచీ సెజ్, భారతీయ ఇంటర్నేషనల్ సెజ్‌లు కూడా ఉన్నాయి. వీటిలో పరిశ్రమల స్థాపన వేగంగా జరుగుతోంది.
ప్రత్యేక ఆర్థిక మండలి ( సెజ్ ) నోటిఫై అయిన చోట పరిశ్రమలు పెడితే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్థిక నిబంధనలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేక ఆర్థిక మండలాలు సాధారణంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పెట్టారు. SEZల రకాలు ఫ్రీ-ట్రేడ్ జోన్లు, ఇండస్ట్రియల్ పార్కులు మరియు ప్రత్యేక జోన్లను కలిగి ఉంటాయి. అందుకే విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తారు.
సెజ్‌ల వ్యవస్థను సక్సెస్ ఫుల్‌గా వినియోగించుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి తమ గత ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన టీమ్ ద్వారా ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమవుతోంది.