ఎన్టీఆర్ – పూరి జగన్నాథ్.. ఈ కాంబినేషన్ ఎప్పుడూ సన్సేషనలే. ఆంధ్రావాలా సమయంలో ఈ కాంబినేషన్‌కి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా.. టెంపర్కీ అదే రకమైన అంచనాలు ఏర్పడ్డాయి. టెంపర్‌తో ఎన్టీఆర్ కూడా దార్లో పడ్డాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. ఇటీవల ఎన్టీఆర్‌కి కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడు పూరి. ఆ సినిమాకి నేతాజీ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఫ్యాన్స్ కూడా ఆటైటిల్తో పోస్టర్లు తయారు చేసి హడావుడి చేశారు.
అయితే నేతాజీ విషయంలో చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. `ఎన్టీఆర్‌కి కథ చెప్పి ఓకే చేయించుకొన్న మాట వాస్తవమే కానీ, ఆ సినిమా టైటిల్ నేతాజీ కాదు` అని పూరి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్, పూరిలు ఇద్దరూ బిజీనే. కాబట్టి 2016లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు అంతంత మాత్రమే. ఈలోగా టైటిల్ విషయంలతో తొందరపడడం ఎందుకూ అని చిత్రబృందం భావిస్తోందట. అందుకే.. టైటిల్ గురించి ఆలోచించలేదని, నేతాజీ అన్నది కేవలం ఫ్యాన్స్ పుట్టించుకొన్న టైటిల్ అని పూరి చెప్పారు.