ఓ సినిమా.. దానికి షార్ట్ కట్ నేమ్ తో టైటిల్ ఇచ్చి కంఫ్యూజ్ చేసి.. అందులో ఇద్దరు హీరోయిన్స్ ను పెడితే ఆ టైటిల్ లో వచ్చే హీరోయిన్ ఎవరు అన్నది ప్రేక్షకులు కన్ ఫ్యూజ్ అవ్వడం ఖాయం. అలాంటి ఫిటింగ్ పెట్టాడు మాటల మాంత్రికుడు త్రివిక్రం.. సినిమా టైటిల్ అ..ఆ అని పెట్టి దాని ట్యాగ్ ను అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అని తగిలించాడు. అయితే సినిమాలో నితిన్, సమంత హీరో హీరోయిన్స్ అని తెలుసు.. టైటిల్ తో కాస్త కన్ ఫ్యూజ్ చేయడం త్రివిక్రంకు అలవాటే.. అయితే ఇందులో ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా నటిస్తుంది. ఒకవేళ త్రివిక్రం ఆమెను కూడా అనసూయను చేసే వీలుంటుంది.
సో ఈ ఆలోచనకు మంగళం పాడేసింది సమంత.. బాహుబలి, కంచె సినిమాలకు గాను వచ్చిన జాతీయ పురస్కారాలను గురించి వారికి కంగ్రాట్స్ చెబుతూ తను చేస్తున్న అ..ఆ సినిమాలో తన రోల్ అనసూయని క్లారిటీ ఇచ్చింది సమంత. అంతేకాదు తన కెరియర్ లో అనసూయ పాత్ర చెప్పుకోదగ్గదిగా ఉంటుందని ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన త్రివిక్రంకు థాంక్స్ అంటూ ట్వీట్ చేసింది.
సో అలా అ..ఆ లో అనసూయగా చేసేది సమంత అని తేలిపోయింది. సో ప్రేమం బ్యూటీ అనుపమ అనసూయ అవుతుందేమో అనుకుని భయపడ్డ సమంత అభిమానులకు ఇదో గుడ్ న్యూస్ అన్నట్టే. ఈరోజుతో టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న అ..ఆ సినిమా కేవలం రెండు సాంగ్స్ మినహా మొత్తం పూర్తయ్యిందట. సో అనుకున్నట్టుగానే త్రివిక్రం అ..ఆ సినిమాను మే మొదటి రెండు వారాల్లో రిలీజ్ అవ్వడం ఖాయమనిపిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా మిక్కి జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.