తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తాజాగా చేసిన కొన్ని వాఖ్యలు రజనీకాంత్ ఫ్యాన్స్ మనసునొచ్చుకునేలా చేశాయి. దీంతో ఫ్యాన్స్ అంతా నిర్మాతపై సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో కేఈ జ్ఞానవేల్ రాజా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇంతకీ ఏం జరిందంటే.. సూర్యతో ‘కంగువా’ సినిమా నిర్మించారు జ్ఞానవేల్ రాజా. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మీ సినిమాలో నటీనటులు వివరాలు ఎందుకు రివిల్ చేయలేదనే ప్రశ్న ఎదురైయింది. ఈ ప్రశ్నకు జ్ఞానవేల్ సమాధానం చెబుతూ.. ‘ రీసెంట్ గా ఓ పెద్ద సినిమా నటీనటుల వివరాలను సినిమా ప్రకటించిన రోజే రివిల్ చేసింది. కానీ, అలా చేయడం వల్ల ఏం ప్రయోజనం కలగలేదు. ఆ చిత్రం ఓపెనింగ్స్‌కు కూడా ఉపయోగపడలేదు. అందుకే ‘కంగువా’లోని నటీనటుల గురించి వివరాలు రివిల్ చేయలేదు’ అని చెప్పారు.
ఈ కామెంట్స్ ఇన్ డైరెక్ట్ గా రజనీకాంత్ ‘వేట్టయన్’కి తగిలాయి. ఇందులో రజనీతో పాటు అమితాబ్, రానా, మంజువారియర్, ఫహద్ లాంటి స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. దసరాకి రిలీజైన ఈ సినిమా అనుకున్నంతగా రాణించలేదు. ఓపెనింగ్స్ వీక్ గా వున్నాయి. దీంతో ఆయన పరోక్షంగా రజనీ సినిమా గురించే మాట్లాడారని కొందరు విమర్శించారు.
కంగువ విడుదలకి ముందు రజనీ ఫ్యాన్స్ తో అనవసరమైన వివాదం ఎందుకని భావించిన జ్ఞానవేల్ రాజా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘నేను చెప్పిన పెద్ద సినిమా.. అక్షయ్ కుమార్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’. ఈ హిందీ సినిమాలోని నటీనటుల వివరాలను టీం ముందే పంచుకుంది. ఎంతోమంది అగ్రనటీనటులు ఉన్నప్పటికీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇదే మాట చెప్పాను. దయచేసిన ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాసేవద్దు’ అని ఒక్కింత ఆగ్రహం వ్యక్తం చేశారాయన.
అయితే జ్ఞానవేల్ రాజా తాజా వివరణ పై కూడా కొందరు వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. సడన్ హిందీ సినిమా టాపిక్ ఎందుకు? జ్ఞానవేల్ రాజా కవర్ డ్రైవ్ ఆడుతున్న సంగతి అందరికీ అర్ధమౌతోందని కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.