మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైన.. కోదండరాం.. కాంగ్రెస్ పార్టీకి పెట్టిన డెడ్‌లైన్ ముగిసింది. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ.. అంతర్గతంగా మాత్రం.. ఏఐసిసి.. తరపున ఓ దూత వచ్చి.. కోదండరాంతో చర్చలు జరిపినట్లు… ప్రచారం జరుగుతోంది. కూటమిలో సీట్లు సర్ధుబాటు అంశాన్ని త్వరగా తేల్చాలని కోదండరాం కాంగ్రెస్ కు హైకమాండ్… ఒక దూతను కోదండరాం దగ్గరకు పంపింది. వీరి భేటీ అత్యంత రహస్యంగా జరిగింది. జనసమితి పార్టీకి చెందిన నాయకుడి కారులో వెళ్ళిన కోదండరా.. జేఏసీ నేత ఇంట్లో ఏఐసీసీ దూతతో చర్చలు జరిపారు. ప్రధానగా సీట్ల సర్దుబాటుపైనే వీరి మధ్య చర్చ జరిగింది.
మహాకూటమి తరుపున తెలంగాణ జనసమితికి 8 లేదా 9 స్ధానాలు కాంగ్రెస్ ముందుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ స్థానాలకు తమకు ఆమోదయోగ్యం కాదని..కోదండరాం తిరస్కించారని సమచారం. సీట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని ..ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక్క సీటైనా కావాలని కోదండరాం డిమాండ్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో.. కాంగ్రెస్ పార్టీ దూత ఎలాంటి హామీ ఇవ్వకుండానే.. వెనుదిరిగాల్సి వచ్చింది. కాంగ్రెస్ దూత ఇచ్చిన ఫార్ములాపై ఎం చేద్దామన్నదానిపై.. కోదండరాం.. తన పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. మరో రెండు రోజులు వేచి చూసి.. కొత్త ప్రతిపాదనలు వస్తే.. దానిపై చర్చించాలనుకుంటున్నారు. లేకపోతే.. తొలి విడత అభ్యర్థుల్ని ప్రకటించాలనుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ తీరుపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. టీజేఎస్‌కు బలం లేని కారణం.. ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తే.. కూటమిపై అంత ప్రభావం పడుతుందని.. అంతిమంగా అది కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేసినా… చేయవచ్చని పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. టీజేఎస్‌తో పొత్తు లేకపోయినా పర్వాలేదని.. చాలా మంది సీనియర్లు ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. కామన్ మినిమం ప్రోగ్రాం చైర్మన్‌గా చేస్తున్నందున.. సీట్ల దగ్గర రాజీ పడాలని కోదండరాంను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కోదండరాం మెత్తబడితే.. కూటమి సీట్ల సర్దుబాటు అంశం.. ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.