బెంగాల్లో పరిస్థితులు.. దిగజారిపోతున్నాయి. అలాంటి ముద్ర వేసేలా … ప్రణాళికా బద్దంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత హింస.. ఈ సారి ఎన్నికల్లో చోటు చేసుకుంటోంది. బెంగాల్లో విద్వేష రాజకీయం.. చివరి విడతకు వచ్చే సరికి… దాడులకు చేరిపోయింది. ఎంతగా అంటే.. ప్రధానమంత్రి మోడీ కూడా.. ఏ మాత్రం.. ఆలోచించకుండా.. బెంగాల్ కంటే కశ్మీర్ లోనే శాంతిభద్రతలు ఉన్నాయని తేల్చేంతగా..! ఇంతకీ.. బెంగాల్ రగిలిపోవడానికి కారణం ఎవరు..?
బెంగాల్‌పై ఎలాగైనా పట్టు సాధించాలనేది బీజేపీ ప్లాన్..!
బెంగాల్లో 42 పార్లమెంట్ స్థానాలున్నాయి. సమస్యాత్మకం అంటూ.. ఈసీ ఏడు విడతల్లో పోలింగ్ పెట్టింది. ప్రతీ విడతలోనూ… హింస చెలరేగింది. ఆరో విడత ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ ప్రచారం .. మరింత హింసాత్మక ధోరణితో సాగింది. మమతా బెనర్జీ.. ఎక్కడా… మత విషయాలను ప్రస్తావించకపోయినా… అమిత్ షా మాత్రం.. తాము జై శ్రీరామ్ అంటే… మమతా బెనర్జీ అరెస్టులు చేయిస్తున్నారని… అదే పనిగా ఆరోపణలు ప్రారంభించారు. అంతే కాదు.. చివరి విడతకు ముందు అమిత్ షా ర్యాలీని అత్యంత ఆర్భాటంగా నిర్వహించారు. ర్యాలీ మొత్తం హిందూ దేవుళ్ల మేకప్‌లతో.. పెద్ద ఎత్తున ఆర్టిస్టుల్ని మోహరించారు. అడుగడుగునా… రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు వీలైనంతగా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే.. మమతా బెనర్జీ తమ ర్యాలీని అడ్డుకుంటోందని ఆరోపణలు చేస్తూ.. పోలీసుల్ని సైతం పట్టించుకోలేదు. చివరికి హింస చోటు చేసుకున్నాక రాజకీయం ప్రారంభించారు.
ఏం జరిగినా సీట్లు తెచ్చుకోవాలని అమిత్ షా పట్టుదల..!
అమిత్ షా నిర్వహించిన ర్యాలీలో అంతా ప్రశాంతంగా జరిగినా… షా …”షో” చివరికి వచ్చే సరికి.. హింస ప్రజ్వరిల్లింది. బీజేపీ, తృణమూల్‌తో పాటు… లెఫ్ట్ కార్యకర్తలు కూడా.. బాహాబాహీ తలపడ్డారు. ముఖ్యంగా… కోల్‌కతాలోని విద్యాసాగర్ కాలేజీ, యూనివర్సిటీ హాస్టల్ దగ్గరకు వచ్చే సరికి పరిస్థితి అదుపుతప్పింది. బీజేపీ కార్యకర్తలు హాస్టల్ గేట్లను మూసివేసి, హాస్టల్ బయట ఉన్న సైకిల్స్, మోటార్‌బైక్స్‌ను తగులబెట్టారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. వేల సంఖ్యలో… మోహరించింది.. బీజేపీ కార్యకర్తలయితే.. అమిత్ షా .. గొడవలు జరిగిన వెంటే… మమతా బెనర్జీపై ఆరోపణలు చేస్తూ.. కోల్ కతా నుంచి వెళ్లిపోయారు. బెంగాల్ పరిణామాలపై… రోజంతా రాజకీయం జరుగుతూనే ఉంది. కేంద్ర మంత్రులు ఢిల్లీలో నోటి మీద వేలు వేసుకుని నిరసనలు నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లోనూ… తృణమూల్ వల్లే హింస చెలరేగుతోందని.. చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.
బెంగాల్లో బీజేపీని ఎదగనీయబోమని మమతా బెనర్జీ పంతం..!
బెంగాల్లో ఈ దుస్థితికి.. రెండు పార్టీల… ఆధిపత్య పోరాటమే కారణం. బెంగాల్లో.. బీజేపీ ఈ సారి ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలని ఆశ పడుతోంది. అందుకే.. ఏడు విడతలుగా… ఎన్నికలు పెట్టింది. పెద్ద ఎత్తున కేంద్ర బలగాల్ని మోహరించి… ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. గత ఎన్నికల్లో ఒక్క సీటే గెలుచుకున్న బీజేపీకి అక్కడ పెద్దగా స్కోప్ లేదు కానీ… ఓట్ల పోలరైజేషన్ కోసం.. విద్వేషాలు రెచ్చగొట్టడంతోనే.. అసలు సమస్య ప్రారంభమయింది. ఇప్పుడు… బెంగాల్ లో హింసకు కారణం అవుతుంది. బెంగాలీ సంఘ సంస్కర్త అయిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పడగొడుతున్న బీజేపీ కార్యకర్తల దృశ్యాలు ఇప్పుడు బెంగాల్ లో హాట్ టాపిక్ అయ్యాయి. బీజేపీ తీరును.. బెంగాలీ ప్రముఖులంతా.. ఖండిస్తున్నారు. ఇది అంతటితో ఆగేలా లేదు. చివరి విడత పోలింగ్ రోజు మరింత ఉద్రిక్తత తప్పని పరిస్థితి ఏర్పడేలా ఉంది.