ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము మోసం చేయాలనుకుంటున్నామని నేరుగానే చెబుతుంది. కానీ తాము ఏ అంశంలో ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారో దాన్నుంచి లబ్ది పొందేందుకు అలాంటిదేం లేదని చెప్పేందుకూ తాపత్రయ పడుతోంది. ఓ వైపు మూడు రాజధానులు ఖాయమని కోర్టు తీర్పులు కూడా లెక్క చేయకుండా ప్రకటనలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధికంటూ భూములు అమ్ముకునేందుకు సిద్ధమయింది.
అయితే పైసా పని చేయకుండా .. రైతులు ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా ఇచ్చిన భూముల్ని ఎలా అమ్ముతారని ప్రశ్నలు వస్తాయి కాబట్టి కొన్ని పనులు మాత్రం ప్రారంభిస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు.. ఇతర మౌలిక సదుపాయల పనులను సీఆర్డీఏ తాజాగా ప్రారంభించి మీడియాకు ఘనంగా సమాచారం ఇచ్చారు. తాము చేపడుతున్న పనులను ఏకరువు పెట్టారు. అయితే ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ అమరావతి నుంచి ఆదాయం కోసం తప్ప అభివృద్ధి కాదు.
భూములమ్ముకోవడానికి అడ్డంకుల్లేకుండా పనులు చేస్తున్నట్లుగా చెప్పుకోవడానికి తాజాగా పనులు ప్రారంభించారు. అద్దెలకు ఇచ్చుకోవడానికి టవర్ల పనులను కొద్ది కొద్దిగా చేస్తున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయకుండా ఎక్కడివక్కడ ఆపేసి.. ఆ కొద్ది మొత్తం నుంచి డబ్బులు పిండుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. భూములిచ్చిన రైతులను వంచనకు గురి చేస్తోంది.