2023 సంక్రాంతి కి ఇంకా చాలా సమయం వుంది. అయితే అప్పుడే సినిమాలు బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి- బాబీ- మైత్రీ మూవీ మేకర్స్ సినిమా పండగని ఫిక్స్ చేసుకుంది. ‘సంక్రాంతికి కలుద్దాం’ అని నిర్మాతలు ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు కూడా సంక్రాంతికే వస్తుంది. వైష్ణవ్ తేజ్ సినిమా కూడా సంక్రాంతికి రెడీ అవుతుంది. దళపతి విజయ్- వంశీ పైడిపల్లి, దిల్ రాజు వారసుడు కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పాన్ ఇండియా సినిమా ప్రభాస్ ఆదిపురుష్ కూడా సంక్రాంతి బరికిలోకే దిగుతుంది. విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ సినిమా కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికి అరడజను సినిమాలి బెర్త్ ఖరారు చేసుకున్నాయి. సినిమాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా వుంది. కొన్ని డ్రాప్ కూడా కావచ్చు. సంక్రాంతి అంటే పెద్ద సినిమాల పండగ కూడా. ప్రతి ఏడాది కనీసం మూడు పెద్ద సినిమాలు వుంటాయి. రెండు రోజుల గ్యాప్ లో వస్తుంటాయి. కరోనా కారణంగా గత రెండేళ్ళుగా కళ తప్పింది. ఈ ఏడాది మళ్ళీ పెద్ద వినోదాలు ప్రేక్షకులు ముందుకు రావడం బాక్సాఫీసు కి సంక్రాంతి కళ వచ్చినట్లే.