పట్టుబట్టి మా ఎన్నికల్లో విజయం సాధించిన మోహన్ బాబు ఫ్యామిలీకి ఓ బలమైన వర్గం నుంచి మద్దతు లభించదని తేలిపోయింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారందరూ రాజీనామా చేయడం.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకేనని ప్రకటించడం వ్యూహాత్మకమే. మంచు విష్ణు ఇచ్చిన హామీలను రెండేళ్లలో అమలు చేయాల్సి ఉంటుంది. సొంత ఖర్చులో మా బిల్డింగ్ కట్టిస్తామని విష్ణు ప్రకటించారు. దాని కోసం కొన్ని కోట్లను విష్ణు ఖర్చు పెట్టాల్సి ఉంటుది. అనేక సంక్షేమ పథకాలను కూడా విష్ణు ప్రకటించారు. వాటిని అమలు చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు కావాల్సి ఉంటుంది.
గెలిచిన తరవాత మోహన్ బాబు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సమస్యలు పరిష్కారం చేయగలగాలంటే ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలి. మోహన్ బాబుకు ఇదేమంత తేలికైన విషయం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే “మా”లో చీలిక చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందరూ కలిసి వచ్చే అవకాశం లేదు. మోహన్ బాబు చేపట్టే కార్యక్రమాలకు వారు హాజరు కావడం డౌటే.
“మా”కు నిధులు సమకూరేది ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ వల్లే ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయిన టాలీవుడ్ నటులు .. కలసి కట్టుగా ఈ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనరు. ప్రోగ్రామ్స్ పెట్టినా స్టార్ హీరోలు హాజరు కారు. అందుకే ఇక మా ఆధ్వర్యంలో ఈవెంట్స్ నిర్వహించడం అంత తేలిక కాదు. అవి జరగకపోతే నిధులు రావు. అందుకే మోహన్ బాబు ముందున్న అసలు సమస్య అందర్నీ కలుపుకుని వెళ్లడమే. ఆ విషయంలో ఆయన ఎంత సక్సెస్ అవుతారో అనే దాన్నిబట్టే “మా” భవిష్యత్ కూడా నిర్ణయం అవుతుంది.