తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్ద చిక్కు వచ్చింది. ఎవర్ని ఫాలో కావాలి.. ఎవరి కోసం ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారు! స్మార్ట్ఫోనులు వచ్చాక…అంతా యాప్స్ మయమే. ఇప్పటివరకూ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్…. సోషల్ మీడియాలో ఈ మూడిటి హవా ఎక్కువ నడిచింది. ఇప్పుడు వీటికి షేర్ చాట్, హలో యాప్స్ పోటీ ఇవ్వడానికి హీరోయిన్లను, సినిమా ప్రముఖులను ఆశ్రయించాయి. తమ యాప్స్‌ను ప్రమోట్ చేసే బాధ్యత హీరోయిన్లపై పెట్టాయి.
రాశీ ఖన్నా ‘హలో’ అంటోంది! తన గురించి, తన సినిమాల గురించి తెలుసుకోవడానికి ‘హలో’ యాప్ డౌన్లోడ్ చేసుకోమని, అందులో తనను ఫాలో అవ్వమని అంటోంది! హీరోయిన్లు మెహరీన్, శ్రియ, రష్మిక మందన్న, మాళవికా శర్మ, మన్నారా చోప్రా, రష్మీ.. హీరోలు సందీప్ కిషన్, నవదీప్, నందు.. కమెడియన్లు ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి, రాహుల్ రామకృష్ణ, జబర్దస్త్ బ్యాచ్ ‘హలో యాప్’ను ప్రమోట్ చేస్తున్నారు.
సమంత ఏమో షేర్ చాట్ డౌన్లోడ్ చేసుకోమని, అందులో తనను ఫాలో అవ్వమని అంటోంది. తను షేర్ చాట్‌లో తెలుగులో మాట్లాడతానని ఒక వీడియో విడుదల చేసింది. తమన్నా, శృతి హాసన్, పూజా హెగ్డే, అనుపమా పరమేశ్వరన్ తదితరులు షేర్ చాట్‌ని ప్రమోట్ చేస్తున్నారు.
షాప్ రిబ్బన్ కట్ చేయడానికి ఎంతోకొంత డిమాండ్ చేసే హీరోయిన్లు… యాప్స్‌ను ఫ్రీగా ప్రమోట్ చేస్తారా? అందుకు తగిన డబ్బును వసూలు చేస్తున్నార్ట! తమ స్థాయిని బట్టి డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండిటి ద్వారా హీరోయిన్లకు డబ్బులే డబ్బులు వస్తున్నాయి. ప్రేక్షకులు కొత్త కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు.. వాళ్ల టైమ్‌పాస్ వాళ్లది!