ఏపీ ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావు.తో పాటు కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు… సీఎం జగన్ తో సమావేశమైన దృశ్యాలను ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది. అందులో ఉన్న బండి శ్రీనివాసరావు హావభావాలు… చూసిన తర్వాత అందరికీ.. . టాలీవుడ్ నుంచి వెళ్లిన సినిమా బృందమే గుర్తుకు వచ్చింది. చిరంజీవితో అత్యంత దారుణంగా బతిమాలించుకుని .. వికటట్టాహాసం చేస్తున్న జగన్ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఉద్దేశపూర్వంగా వాటిని విడుదల చేశారు. బండి శ్రీనివాసరావు అండ్ కో దృశ్యాలు కూడా అలాగే ఎడిట్ చేసి విడుదల చేశారు. వాటిని చూసిన వారికి… వారెందుకు అలా పొగుడుతున్నారో తెలుసు .. ఇంత సైకోతనమా అని ఆశ్చర్యపోవడం వారి వంతవుతోంది.
ఉద్యోగుల్ని రాచి రంపాన పెట్టి కాళ్లు పట్టించుకోవడమే ఇది !
చంద్రబాబు ఉన్నప్పుడు పీఆర్సీ వేసి 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చారు. డీఏలు ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చారు. కానీ జగన్ .. మొత్తం డీఎల్ని పీఆర్సీలో కలిపేసి అడ్డగోలుగా మోసం చేశారు. ఇంకా అనేక ప్రయోజనాలని తీసేశారు. వారు దాచుకున్న సొమ్మును వాడుకున్నారు. డీఏలు కూడా ఇవ్వడం లేదు . ఒక డీఎ ప్రకటిస్తే.. వచ్చే నాలుగైదు ఏళ్లలో బకాయిలు చెలిస్తామని చెబుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని మోసం చేశారు. నోరెత్తితే అరెస్టులు చేస్తామని.. నలుగుర్ని అరెస్ట్ చేసి … ఓ ఉద్యోగ సంఘం నేతను పరారీ అయ్యేలా చేసి అందర్నీ దారికి తెచ్చుకున్నారు. కొంత మంది చేత కాళ్లు పట్టించేసుకున్నారు.
గతంలో టాలీవుడ్ పైనా అదే ట్రీట్ మెంట్ !
ఇంతకు ముందు టాలీవుడ్ పైనా ఇదే ట్రీట్ మెంట్ ప్రయోగించారు. టిక్కెట్ రేట్లు ఐదు.. పది రూపాయలు నిర్ణయించి… వాళ్లను కాళ్ల బేరానికి తెప్పించుకున్నారు. చాలా మంది తగ్గలేదు కానీ ఇండస్ట్రీ పెద్దగా బాధ్యత తీసుకున్న చిరంజీవి కొంత మంది హీరోల్ని తీసుకుని వెళ్లారు. కానీ అక్కడ ఆయన మాట్లాడిన మాటలు బయటకు విడుదల చేసి.. టాలీవుడ్ తమ కాళ్ల బేరానికి వచ్చిందని ప్రజల ముందు పెట్టారు. అప్పుడు కూడా ఇంత సైకోతనమా అని జనం ఆశ్చర్యపోయారు.
యథా రాజు.. తథా పార్టీ నేతలు !
ప్రజలు ఇచ్చిన అధికారం ఇలా వేధింపులకు గురి చేసి వారి ఆత్మాభిమానాన్ని తమ కాళ్ల ముందు పెట్టించుకుని మురిసిపోతున్న పాలకుడి తరహాలోనే ఆయన పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారు. ఎవరి తరహాలో వారు ప్రజల్ని వేధిస్తున్నారు. రేపు వీరంతా తమ పదవులు కోల్పోయిన తరవాత అసలు వీరి స్థానమేంటో జనం చూపిస్తారన్న ఆగ్రహం.. బాధిత వర్గాల్లో కనిపిస్తోంది. ఆత్మాభిమానాన్ని ఇంతలా దెబ్బకొట్టి.. తన అధికారం చూపిచుకుంటున్న వీరి తీరు.. అత్యంత దారుణంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.