మార్చిలో బాక్సాఫీస్ జాతకం ఏం మారలేదు. సంక్రాంతి తరవాత సరైన సక్సెస్ లేని తెలుగు సినిమాకు గత లో కూడా మొండి చేయే ఎదురైంది. ఏకంగా ఏడెనిమిది సినిమాలు వరుస కట్టినా, ఒక్క సినిమాకీ సరైన ఫలితం రాలేదు. ‘రజాకార్’ చిత్రానికి ప్రశంసలు అందాయి కానీ, కమర్షియల్ రిజల్ట్ మాత్రం దక్కలేదు. అయితే ఈవారం పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది.
ఎందుకంటే ‘ఓం భీమ్ భుష్’ ఈవారమే వస్తోంది. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ‘హుషారు’ ఫేమ్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. పైగా ప్రమోషన్ కూడా బాగానే చేస్తున్నారు. ‘సామజవరగమన’ తో శ్రీవిష్ణు మంచి విజయాన్ని అందుకొని ఫామ్ లోకి వచ్చేశాడు. కాబట్టి.. ఈ సినిమాపై కొన్ని ఆశలు, అంచనాలూ కలిగాయి. మంచి కామెడీ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది. ఆ లోటు… ‘ఓం భీమ్ భుష్’ తీర్చే అవకాశం ఉంది.