తెలంగాణ ప్రభుత్వానికి సినిమా టికెట్ ధరలు తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి సంబధించిన కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ”ఎక్కడో ఎవరో టికెట్ ధరలు తగ్గించారని, వారిని చూసి తాము కూడా అలా తగ్గించేది లేదని, సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన వుందని తెలిపారు. ఒమిక్రాన్ వైరస్ మొదలైన నేపథ్యంలో థియేటర్ల మూత, ఆక్యుపెన్సీ తగ్గింపు తదితర ప్రచారాలను నమ్మొదని తెలిపిన తలసాని.. కరోనా దృష్ట్యా థియేటర్లపై ఆంక్షలు విధిస్తామన్న ప్రచారం రూమర్ అని కొట్టిపారేశారు.
‘కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. ‘అఖండ’ విడుదలైన తర్వాత థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య కాస్త పెరిగింది. త్వరలోనే పుష్ప, భీమ్లా నాయక్, ఆచార్య లాంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయి. థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి సమయంలో దర్శక-నిర్మాతలు అప్రమత్తంగా ఉండాలి. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది’” అని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంత్రితో భేటీ అయిన వారిలో నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, యేర్నేని నవీన్, ప్రమోద్, అభిషేక్ నామా దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ తదితరులు ఉన్నారు.