ఒకరు కాదు ఇద్దరు కాదు.. యావత్ టాలీవుడ్ తారలంతా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్యక్రమంతో బిజీ అయిపోయారు. ఎక్కడ వీలైతే అక్కడ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. బహుశా స్వచ్ఛ భారత్ తర్వాత తెలుగు సినీ సెలబ్రిటీలంతా పాలు పంచుకొంటున్న కార్యక్రమం ఇదే కావొచ్చు. హరితహారం కార్యక్రమంలో పాల్గొని ఈ సెలబ్రిటీలంతా తలా ఒక చెట్టు నాటారు, నాటుతున్నారు.
మా అధ్యక్షుడు, నటుడు రాజేంద్ర ప్రసాద్, హీరో అల్లు అర్జున్, మరో హీరో దగ్గుబాటి రాణా ల దగ్గర నుంచి కాదంబరి కిరణ్ కుమార్ వంటి చోటా మోటా నటుల వరకూ అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యారు. గోపిచంద్, సింధు, ముఖేష్ కుమార్ వంటి క్రీడా రంగ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చెట్లు నాటారు. హఠీరో అ్లు అర్జున్ తన ఇంటి వద్దనే హరిత హారంలో భాగంగా చెట్లు నాటగా, రామానాయుడు స్టూడియోలో చెట్లు నాటాడు దగ్గుబాటి రాణా.
ఇక హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నాలు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇంత మంది సినీ సెలబ్రిటీల్లో ఒక్కసారిగా కదలిక రావడం వెనుక తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మంచి ప్రచారాన్ని తీసుకురావడానికి ఆయన సినీ సెలబ్రిటీలను ఇందులో మమేకం చేసినట్టుగా తెలుస్తోంది. రికార్డు స్థాయిలో చెట్లు నాటుతున్న ఈ కార్యక్రమంలో వాళ్లందరినీ కలుపుకున్నారు. మరి చెట్లు నాటడంఅయితే మంచి పనే. మరి నాటితే సరిపోదు .. నాటిన వెయ్యి చెట్లలో వంద చెట్లను సంరక్షించుకున్నా.. మంచిదే. అలాకాకుండా వట్టి ప్రచార యావగా మిగిలిపోతేనే ఇదంతా నిష్ప్రయోజనం అవుతుంది.
#HaithaHaram in KBR Parkhttps://t.co/fVVM4u3CjN pic.twitter.com/y2h6MWOsr6
— Telugu360 (@Telugu360) July 10, 2016
Good Morning!! This is how my day began! Tree plantation in Nanakramguda!! Make urs as green!! #HarithaHaram pic.twitter.com/kcqy8CZGiH
— Rana Daggubati (@RanaDaggubati) July 11, 2016
Minister KTR addressing the volunteers at #GreenHyderabad #HarithaHaram event at Biodiversity Park pic.twitter.com/uPAf0Q8bgI
— KTR, Former Minister (@MinisterKTR) July 11, 2016
It was nice to see the Jubilee Hills police at the #HarithaHaram to plant trees along with us? pic.twitter.com/AMY0rTML6c
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 11, 2016