ఇప్పుడు దర్శకులు పగడ్బందీగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అస్సలు తొందరపడటం లేదు. వచ్చిన క్రేజ్ ను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. హిట్ మీద నడిచే ఇండస్ట్రీ ఇది. ఒక్క సినిమాతో ఇక్కడ జాతకాలు మారిపోతాయి. అందుకే ఒక హిట్ పడిన తర్వాత దానితో వచ్చిన క్రేజ్ నిలబెట్టుకోవడానికి ఎంత కాలమైనా ఎదురుచూపులకు సిద్ధమౌతున్నారు. ఒక హిట్ తర్వాత పెద్ద సినిమానే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీనికోసం ఏళ్ల తరబడి ఎదురుచుపులకు సిద్దం అంటున్నారు. దీనికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ”మిర్చి” తర్వాత కొరటాల శివకు ఉవ్వెత్తున అవకాశాలు వచ్చాయి. కాని శివ తొందరపడలేదు. తన నెక్స్ట్ టార్గెట్ మహేష్ బాబు అని ఫిక్స్ అయిపోయాడు. అయితే అప్పటికి మహేష్ చాల బిజీ. అయినా కొరటాల తొందరపడలేదు. మహేష్ కోసం దాదపు రెండేళ్ళు వెయిట్ చేసి మహేష్ కి కుదిరిన తర్వాతే ‘శ్రీమంతుడు’ తీశాడు.
ప్రస్తుతానికి వస్తే.. సుజిత్ గురించి చెప్పుకోవాలి. ‘రన్ రాజా రన్’ లాంటి ఫన్ సినిమా తీసి అందరినీ ఆకట్టుకున్నాడు సుజిత్. తొలి సినిమాతోనే దర్శకుడిగా సుజిత్ పేరు మార్మోగిపోయింది. అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అయితే సుజిత్ టార్గెట్ మాత్రం ప్రభాస్. రెండో సినిమా ప్రభాస్ తోనే తీయలాని ఫిక్స్ అయ్యాడు. కధ చెప్పి ఓకే చేయించుకున్నాడు. అయితే ప్రభాస్ దాదాపు మూడేళ్ళు బాహుబలికి అంకితం అయిపోయాడు. అయినా పర్వాలేదు వెయిట్ చేస్తానని ఫిక్స్ అయ్యాడు సుజిత్. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభాస్ సినిమా మొదలైయింది. ఈ రోజు సినిమాకి కొబ్బరికాయ్ కొట్టారు.
ఇలాంటి వెయిటింగ్ లిస్టు పరిశీలిస్తే.. ‘జిల్’ ఫేం రాధ కృష్ణ కుమార్ పేరు ముందు వరుసలో వుటుంది. గోపిచంద్ తో ‘జిల్’ తీసి తొలి ప్రయత్నంలో సక్సెస్ కొట్టాడు రాధ. ఇందులో రాధ టేకింగ్ చూసి అంతా ఫిదా అయిపోయారు. అయితే రాధ నుండి కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఇప్పుడాయన చరణ్ కోసం వెయిటింగని టాక్. జిల్ తర్వాత చరణ్ ను కలిసాడు రాధ. చర్చలు జరిగాయి. చరణ్ , రాధ చెప్పిన కధను హోల్డ్ లో పెట్టడని టాక్. అలాగే ప్రభాస్ తో కూడా ఓ సినిమా ప్లాన్ వుంది. ఇప్పుడీ రెండు సినిమాల కోసమే రాధ వెయిటింగ్. మేర్లపాక గాంధీ పరిస్థితి కూడా ఇదే. వెంకటాద్రి, ఎక్స్ ప్రెస్ రాజా .. ఇలా రెండు క్రేజీ హిట్లు కొట్టాడు గాంధీ. ఇప్పుడు కూడా బోలెడు అవకాశాలు వున్నాయి. అయితే ఈ క్రేజ్ వున్నప్పుడే ఓ భారీ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. చరణ్ కు ఆ మధ్య ఓ కధ వినిపించాడు. అయితే పెద్ద హీరోతో సినిమా అంటే నిరీక్షణ తప్పుదు. ఇప్పుడీ నిరీక్షణలోనే వున్నారు వీరిద్దరు.