దీపావళి సినిమాలకి పండగే. ఈ పర్వదినం పురస్కరించుకొని బోలెడు కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. మెగాస్టార్ చిరంజీవి- బాబీ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఖారారు చేస్తూ టీజర్ వదిలారు. చిరు వింటేజ్ మాస్ లుక్ లో అలరించారు. రవితేజ ధమాకా రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. డిసెంబర్ 23న సినిమా వస్తోంది. అలాగే రవితేజ, సుధీర్ వర్మ ‘రావణాసుర’ ఏప్రిల్ 7, 2023న విడుదల చేస్తునట్లు చెప్పారు.
అఖిల్ కూడా సంక్రాంతికి వస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. విజయ్- వంశీ పైడిపల్లి- దిల్ రాజు- ‘వారసుడు సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగుతుంది. సమంత యశోద, ధనుష్ సార్, సుధీర్ బాబు హంట్ తో పాటు మరిన్ని సినిమాల పోస్టర్లు దీపావళి శుభాకాంక్షలతో విడుదలైయ్యాయి. దీపావళి ప్రకటనలు చూస్తుంటే సంక్రాంతి పోటీ ఈసారి గట్టిగా ఉండబోతుందని అర్ధమౌతుంది. వాల్తేరు వీరయ్య, వారసుడు, ఏజెంట్ తో పాటు బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా సంక్రాంతి బరిలోనే దిగుతున్నాయి