సిట్ విచారణ పర్వం జోరుగా సాగుతోంది. రోజుకో సినీ సెలబ్రెటీ సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు. తొలి రోజు పూరి తో మొదలైన ఈ ప్రహసనం ఈరోజు కళాదర్శకుడు చిన్నా వరకూ వచ్చింది. ముమైత్, ఛార్మి, రవితేజ, తనీష్ విచారణకు హాజరు కావల్సివుంది. అయితే… విచారణలో భాగంగా సిట్ అధికారులకు దిమ్మతిరిగే నిజాలు తెలుస్తున్నాయి. సినిమావాళ్ల ముందు చూపుకూ, తెలివి తేటలకూ సిట్ ఆశ్చర్యపోతోంది. విచారణకు వస్తున్నవాళ్లంతా అలువీరా జ్యూస్ తాగి వస్తున్నార్ట. అలువీరా తాగితే ఓ సౌలభ్యం ఉంది. ఒకవేళ రక్త నమూనాలు తీసుకొంటే – డ్రగ్స్ తీసుకొన్న విషయం తెలుసుకోవడం కష్టం అవుతుందని సమాచారం. దాంతో.. సిట్ అధికారులు నివ్వెరపోతున్నార్ట. డ్రగ్స్ తీసుకొన్నారో లేదో తెలుసుకోవడం కోసం అవసరమైతే ఓ ప్రత్యేక యంత్రాన్ని తీసుకొస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. విచారణకు వస్తున్నవాళ్లంతా ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకొనే వస్తున్నారని, తెలివి తక్కువగా వ్యవహరించడం లేదని సిట్ చెబుతోంది. ఛార్మి వ్యవహారంపై కూడా సిట్ అధికారులు స్పందించారు. ఛార్మి కి హైకోర్టులో ఊరట లభించలేదని, ఛార్మి విచారణని తప్పించుకోవాలని చూసిందని, కానీ కుదర్లేదని సిట్ తేల్చి చెప్పింది.
* వైట్ రూలేంటి?
సిట్ ముందు హాజరైన పూరి, సుబ్బరాజు, నవదీప్, చిన్నా, శ్యాం కెనాయుడు వీళ్లంతా వైట్ షర్ట్ వేసుకొనే కనిపించారు. ఇలా అంతా ఒకే డ్రస్కోడ్ లో ఎందుకు వస్తున్నారు? అనే ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. వైట్ డ్రస్‌లో రావడం డ్రస్ కోడా? యాదృఛ్చికమా? అని చర్చించుకొంటున్నారు. ఇదేం యాధృచ్చికం కాదు. సిట్ అధికారులు వైట్ షర్ట్ వేసుకురావాలని ఆదేశించార్ట. అందుకే.. వీళ్లంతా తెల్ల చొక్కాలతో కనిపించారు. ఛార్మి, రవితేజ, తనీష్, ముమైత్ కూడా ఈ డ్రస్ కోడ్ పాటించాల్సిందే.