సినీ పరిశ్రమలో వ్యక్తులను అధికారికంగా చెప్పనప్పటికీ పేర్లు వెల్లడయ్యాయి. రవితేజ, అతని కారు డ్రైవర్ శ్రీనివాస్, నటుడు సుబ్బరాజు, చిన్నా, తరుణ్, తనీష్, చార్మి, ముమైత్‌ఖాన్, పూరి జగన్నాథ్, నవదీప్, కె. శ్యామ్‌నాయుడు, గాయని గీతామాధురి భర్త నందు ఉన్నారంటూ ప్రచారంలోకి తెచ్చారు. మొత్తం 19మంది డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ వారికి నోటీసులు జారీ చేశారు. కానీ వారికి అవి అందలేదు. మా అసోసియేషన్‌కు అకున్ సబర్వాల్ సమాచారాన్ని అందించారు.
వారం రోజులలోగా ఎక్సయిజ్ శాఖ అధికారుల విచారణకు హాజరుకాకుంటే అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
వారే వాడుతున్నారని మీ దగ్గరుంటే హెచ్చరికలేమిటండీ.. పట్టుకొచ్చి లోపలెయ్యక. డబ్బున్నవారు కాబట్టే ఇలా బతిమలాడుతున్నారా. ఇలాంటి వైఖరి నెగటివ్ సందేశాన్ని పంపుతుంది. మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఇందులో ఉన్నారంటున్నారు. ఆ పిల్లల్లో ఒకాయన తండ్రి మొన్నటి మా మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడిదాకా వచ్చారు కాబట్టి.. తెలంగాణ ప్రభుత్వం.. అకున్ సబర్వాల్ పట్టు వదలకూడదు. నేరస్థుడు ఎంత పెద్దవాడైన వదిలేది లేదనే సంకేతాలు పంపితే.. మిగిలిన వారికి హెచ్చరిక సంకేతాలు పంపినట్లవుతుంది. పనిలో పనిగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలలో రాత్రిపూట రేస్‌లలో పాల్గొనే వాళ్ళని కూడా నాలుగు తగిలిస్తే.. అంతా దారిలోకొస్తారు. పేర్లు చెప్పడం.. ముసుగులేసి మీడియాకు చూపడం కాదు.. వారిని ప్రత్యక్షంగా చూపాలి. వీరినా ఇంతకాలం మేము అభిమానించిందని వారి అభిమానులు ఛీత్కరించుకోవాలి. అప్పుడు గానీ వీరి శైలిలో మార్పు రాదు.