డ్రగ్స్.. డ్రగ్స్.. డ్రగ్స్. ఈ విషయంలో మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దేశంలో, రాష్ట్రంలో మరేతర సమస్య లేనట్లు.. ఒకటే డ్రగ్స్ మోత. దీనికి కారణం… ఈ డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల పేర్లు వుండటమే మీడియాను ఎట్రాక్ట్ చేసిన పాయింట్. అసలు ఇది ఎలాంటి కేసు అనే చెప్పే నైతిక భాద్యత లేకుండా.. దొరికిందే తడువుగా మోత మోగిమ్చేశాయి మీడియా ఛానళ్ళు.
” డ్రగ్స్ రాకెట్ లో ఒక ముఠా దొరికింది. ఆ ముఠా నుండి డ్రగ్స్ వాడినట్లు కొందరిని గుర్తుంచారు. వారిని విచారించి ఆధారాలు సేకరిస్తే.. ఆ ముఠాపై కేసు ఇంకా బలంగా ఉటుంది. ప్రస్తుతం విచారణ ఎదుర్కుంటున్న ప్రముఖులు సాక్ష్యులు మాత్రమే. వీరిలో కొంత మంది డ్రగ్స్ ముఠాతో నేరుగా సంబధాలు పెట్టుకున్నారు అని తేలితే చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు” ఇదీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెర్షన్. కానీ మీడియా మాత్రం రభస చేసి పారేసింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని లీకులు ఇచ్చి సంచలనానికి ప్రయత్నించినట్లు కనిపించాయి. కనీసం ఆ శాఖ నుంచి కూడా ఒక్క అప్డేట్ కూడా లేదు.
ఇప్పుడు ఈ కేసు గురించి పట్టించుకున్న నాధుడే లేడు . అంత హంగామా చేసిన మీడియా ఈ వార్తను పక్కన పెట్టేసి కొత్త వార్తలు వెదుక్కుకుంది. అటు డిపార్ట్మెంట్ కూడా సైలంట్ అయిపోయింది. ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సినీ ప్రముఖులకు వార్నింగ్ ఇచ్చి వదిలేసినట్టు సమాచారం. మొత్తంమ్మీద ఈ కేసు కాలంలో కలిసిపోయిందనే అనుకోవాలేమో.