సూపర్ స్టార్ కృష్ణ వెళిపోయారు. ఆయనతో పాటు చిత్ర పరిశ్రమకి సంబంధించినంత వరకూ ఒక తరం కనుమరుగైంది. ఆ తరం సినిమాలు నెమరు వేసుకుంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజు.. గుర్తుకు వస్తారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ 1996లో లోకాన్ని విడిచారు. శోభన్ బాబు 2008లో ఏఎన్ఆర్ 2014లో, కృష్ణం రాజు 2022లో తుది శ్వాసలు విడిచారు.
ఆ తరానికి ప్రతినిధిగా కృష్ణ వుండేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజు వీరందరితోనూ కృష్ణకి మంచి సంబంధాలు వున్నాయి. మంచి స్నేహం వుంది. వీళ్ళందరితోనూ సినిమాలు చేశారు కృష్ణ. ముఖ్యంగా శోభన్ బాబుతో అత్యధిక సినిమాలు చేశారు. వీరిద్దరినీ వెండి తెర కృష్ణార్జునులుగా అభివర్ణించేవారు అభిమానులు.
కృష్ణం రాజు చనిపోయినప్పుడు కూడా నాటి సంగతులని గుర్తు చేసుకొని మాట్లాడారు కృష్ణ. ఎనభై ఏళ్ళు వచ్చినా గుర్తుపెట్టుకొని ప్రతి అంశాని ప్రస్థావించారు. ఆ తరం జ్ఞాపకాల్ని పంచుకోవడానికి కథానాయకుల్లో వున్న ఏకైక ప్రతినిధి కృష్ణ. ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోవడంతో ఒక తరం వెళ్ళిపోయినట్లయింది.