హిట్లెప్పుడూ ఒంటరిగా రావు. వస్తూ వస్తూ… మరింత క్రేజ్‌ని, ఇమేజ్ నీ తీసుకొస్తాయి. దాంతో పాటు కాస్త యాటిట్యూడ్ కూడా. స్టార్ డమ్ సంపాదించిన హీరోలు అప్పుడప్పుడూ.. కాస్త తలబిరుసుదనం ప్రదర్శిస్తుంటారు. అది వాళ్ల తప్పు కూడా కాదు. చేతిలో ఉన్న హిట్టు మహిమే అదంతా. తాజాగా ఇటీవల ఓసూపర్ డూపర్ హిట్టు కొట్టిన హీరో, సెట్లో ఆటిట్యూడ్ చూపించడం, అది చూసి దర్శకుడు ఇరిటేట్ అయిపోవడం జరుగుతున్నాయని ఇన్ సైడ్ వర్గాల టాక్.
ఓ స్టార్ హీరో, ఓ స్టార్ డైరెక్టర్ కలిసి ఓ సినిమా చేస్తున్నారిప్పుడు. ఆ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇద్దరి మధ్య మంచి రాపో కూడా ఉంది. అయితే.. ఈమధ్య ఓ సూపర్ హిట్టు కొట్టిన ఉత్సాహంలో.. ఆ హీరో కాస్త ఆటిట్యూడ్ చూపిస్తున్నాడని సమాచారం. హీరోగారిని కలవాలంటే.. చాలామందిని దాటుకుని వెళ్లాలంట. సెట్లో కూడా అంతేనట. షాట్ అయిపోగానే… హీరో తన కార్ వాన్ లోకి వెళ్లిపోతే, దర్శకుడు కలవాలన్నా… సీన్ వివరించాలన్నా, చాలా సమయం పడుతోందని, ఆ దర్శకుడు కూడా నేరుగా హీరో కార్ వాన్ లోకి వెళ్లిపోయే చనువే లేదని, మేనేజర్, పర్సనల్ స్టాఫ్.. వీళ్లందరి అనుమతులతో.. వెళ్లాల్సివస్తుందని.. ఇలాంటి ప్రవర్తన ఆ హీరోలో ఇంత వరకూ చూడలేదని… గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగని ఆ హీరో… ఆ దర్శకుడు కలసి పనిచేయడం ఇదే తొలిసారా? అంటే అదీ కాదు. ఇద్దరూ కలిసి ఇది వరకే పనిచేశారు. అయినా సరే.. తన దగ్గరే ఆటిట్యూడ్ చూపించడం ఆ దర్శకుడికీ చాలా ఇబ్బందిని కలిగిస్తోందని, ఆ ఇరిటేషన్ తన స్టాఫ్ దగ్గర చూపించడం మొదలెట్టాడని, దాంతో.. సెట్లో ఈగోలు పురిగొప్పుతున్నాయని ఇన్ సైడ్ వర్గాల టాక్. మరి ఈ ఈగోల గోల ఎక్కడి వరకూ వెళ్తుందో ఏమో?