ఎక్కడ చూసినా వాళ్లిద్దరే కనిపిస్తున్నారు. పేజ్ త్రీ పర్సన్ గా వెలుగొందుతున్న ఆ హీరో ఒక పెద్ద సినీ కుటుంబం నుంచి వీళ్లిద్దరూ కలిసి సినిమాలేవీ చేయలేదు కానీ.. ఎక్కడ కనెక్ట్ అయ్యారో ఒకరికొకరు పడిపోయారు! సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమో , ఆకర్షణో కానీ… ఇప్పడు వీళ్లిద్దరూ కలిసి కాపురమే పెట్టేశారని సమాచారం. హీరోగారి గెస్టౌస్ వీరి సహజీవనానికి వేదిక అయ్యిందని తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా వేరే హీరోయిన్లతో వ్యవహారాలను నడిపిన వాడిగా ప్రచారాన్ని ఎదుర్కొన్నాడు ఆ హీరో. ఇలాంటి నేపథ్యంలో ఆ ప్లేబాయ్ కి ఈ హీరోయిన్ కూడా పడిపోయింది.
ఈ రకమైన సాన్నిహిత్యం ఉన్న వీళ్లు ఇప్పుడు బహిరంగ వేదికల మీద కూడా తమ అనుబంధాన్ని గుర్తు చేసేస్తున్నారు! వివిధ కార్యక్రమాలకు ఇద్దరూ కలిసే వాటికి హాజరవుతున్నారు. ఇలా విహరించేస్తున్నారు. తన కోసం ట్రై చేసిన చాలా మంది సినిమా వాళ్లను పక్కనపెట్టేసి ఆ చలాకీ హీరోయిన్ ఆ హీరోని ఎంచుకోవడం ఆసక్తికరమైన అంశమే. మరి వీరి బంధం ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి!