టాలీవుడ్లో ఓ ఉన్నత కుటుంబం నుంచి వచ్చి.. హీరోగా మారాడాయన. చేతిలో రెండు మూడు హిట్లు కూడా ఉన్నాయి. బాగా సౌండ్ పార్టీ. అత్తవారి ఇంటి ఆస్తులూ బాగా కలిశాయి. చేతి నిండా డబ్బు ఉండే సరికి బిజినెస్‌లు మొదలెట్టాడు. ఇటీవలే రియల్ ఎస్టేట్లోకీ దిగాడు. హైదరాబాద్ శివార్లలో భారీ మొత్తంలో భూముల్ని కొనుగోలు చేశాడు. దాదాపు రూ.200 కోట్ల రూపాయల వరకూ స్థిరాస్థులపై పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. అయితే… ఇప్పుడు పెద్ద నోటు దెబ్బతో తన భూముల్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. మోడీ ప్రకటనకు ముందు రోజు ఓ విలువైన ఆస్థిని కొనుగోలు చేశాడట. బ్లాక్ సొమ్ము వైట్ అయిపోయిందన్న ఆనందం ఉన్నా… అదీ కొన్ని రోజులే. ఈ బ్లాక్ మనీ వ్యవహారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా జీరోకి పడిపోయింది. డబ్బులన్నీ ఓచోట స్ట్రక్ అయిపోవడంతో ఇప్పుడా హీరో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగం కుదుట పడడానికి చాలా టైమ్ పట్టేట్టుంది. దానికి తోడు ఇప్పుడున్న రేట్లు అప్పుడు ఉండకపోవొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా కొన్ని స్థలాలు బినామీ పేరుతో కొన్నాడట. మోడీ త్వరలోనే బినామీ ఆస్తులపైనా ఓ కన్నేస్తాడని సమాచారం అందడంతో ఇంకాస్త దిగులు పట్టుకొందని తెలుస్తోంది. ఈ హీరోకి ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఆ సంస్థలో తరచూ సినిమాలు తీయడం అలవాటు. ఇప్పుడు ఆ డబ్బు కూడా రియల్ ఎస్టేట్‌లోనే బదాలించడంతో… తన కెరీర్ కూడా సందిగ్థంలో పడినట్టైంది. ఈ ఒక్క హీరో పరిస్థితే కాదు.. చాలామంది ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. టాలీవుడ్లో సొమ్ములన్నవాళ్లంతా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబళ్లుగా పెట్టినవాళ్లే. కనీసం ఏడాది పాటు తమ వ్యాపారాలన్నీ హోల్డ్‌లోకి వెళ్లిపోతాయి. ఆ ఎఫెక్ట్ సినిమాల నిర్మాణాలపైనా భారీగా పడే అవకాశం ఉందని టాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు.