అల్లు అర్జున్ కు మాలీవుడ్ లో పిచ్చ మార్కెట్ వుంది. బన్నీ ప్రతి సినిమా అక్కడ సూపర్ రేంజ్ లో ఆడుతుంది. అల్లు అర్జున్ ను అక్కడ ‘మల్లు స్టార్’ అని పిలుచుకుంటారు. ఇపుడు బన్నీ కోలీవుడ్ పై కన్నేశాడు. ఆల్రెడీ మాలీవుడ్ లో స్టార్ స్టేటస్ దక్కించుకున్న బన్నీ ఇప్పుడు తమిళ మార్కెట్ పై కూడా పట్టు సాధించాలని ప్లాన్ చేస్తున్నాడు. దీనికి కోసం పక్కా స్కెచ్ రెడీ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అక్కడ పట్టు సాధించాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాధం చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఇప్పటికే కొబ్బరికాయ్ కొట్టేశారు. బన్నీ చేస్తున్న తొలి బైలింగ్వల్ చిత్రమిది. ఈ సినిమా తర్వాత కూడా మరో బైలింగ్వల్ కి రెడీ అవుతున్నాడు బన్నీ. అల్లు అర్జున్ -విక్రమ్ కుమార్ కలయికలో ఓ సినిమా ఎప్పటినుండో చర్చల్లో వుంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే..ఇటివలే బన్నీ , విక్రమ్ చెప్పిన కధను లాక్ చేశాడని తెలిసింది. లింగుస్వామీ సినిమా తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. ఈలోగ అఖిల్ సినిమాని ఫినిష్ చేస్తాడు విక్రమ్.
రజనీకాంత్, కమల్, విక్రమ్ , సూర్య , కార్తీ.. ఇలా చాల మంది తమిళ్ స్టార్స్ టాలీవుడ్ బాక్సాఫీసు పై పట్టుసాధించారు. అయితే టాలీవుడ్ స్టార్స్ అక్కడ ఈ స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు తొలిసారి తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ రెడీ చేస్తున్నాడు. బన్నీ రెండు బైలింగ్వల్లు సెట్ చేశాడు. ఈ చిత్రాలు కనుక అనుకున్నట్లు అక్కడ వర్క్ అవుట్ అయితే టాలీవుడ్ మార్కెట్ ను మరింత స్ట్రాంగ్ చేయొచ్చక్కడ.