కొత్త సంవత్సరాది అనగానే అందరికీ హీరోయిన్లే గుర్తుకొస్తారు. సన్నీలియోన్ హైదరాబాద్ లో పార్టీ చేస్తుందా? ముంబైలో ఉంటుందా? అని ఆత్రుతగా ఎదురుచూస్తారు పార్టీ ప్రియులు. ఏ హీరోయిన్.. ఏ పార్టీలో సందడి చేయబోతుందో తెలుసుకుని ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ.. హీరోల గురించి కూడా అభిమానుల్లో కొంత ఉత్సుకత కనిపిస్తోంది. ఈసారి కొత్త సంవత్సరానికి తమ అభిమాన హీరోలు ఎక్కడ, ఎలా స్వాగతం చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
2016కి దుబాయ్ లో స్వాగతం చెప్పబోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొన్నిరోజుల క్రితమే మొత్తం కుటుంబంతో కలసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లాడు మహేశ్. కొత్త సంవత్సరానికి కుటుంబంతో కలిసి స్వాగతం పలకబోతున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ కొత్త ఏడాదికి రాజస్థాన్ లో రారమ్మంటూ ఆహ్వానించనుంది సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్. ప్రభాస్ కూడా బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో కేరళ కూడా వెళ్లబోతున్నాడు. కాబట్టి.. 2016 లో మొదటి ప్రభాత కిరణాలు.. షూటింగ్ స్పాట్ లో చూస్తాడు ప్రభాస్.
నాగచైతన్య, సమంత గోవా టూర్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా లు కూడా ఎంజాయ్ చేయడానికి గోవా టూర్ కి వెళ్లిపోయారు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కుటుంబంతో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏదో కొద్దిసేపు అలా స్నేహితులతో సరదాగా అర్ధరాత్రి బైక్ మీద రౌండ్స్ కొట్టి వచ్చినా.. చివరకు కుటుంబంతో కలిసి కేక్ కట్ చేసి.. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుని.. ఆనందంగా గడపబోతున్నారు.