సినీ పెద్దలంతా కలిసి ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంలోని కీలక మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఇటీవలి పరిణామాలతో ఈ భేటీ ఖచ్చితంగా హైలెట్ అవుతుంది. మామూలుగా అయితే ఇలాంటి సమావేశం ప్రభుత్వం మారిన తర్వాతే ఇలాంటి సమావేశం జరగాల్సింది. కానీ జరగలేదు. ఒకరిద్దరు వ్యక్తితంగా ప్రభుత్వంలోని ముఖ్యులను కలిశారు కానీ.. అసలు టాలీవుడ్ మొత్తం ప్రభుత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం చేయలేదు. దాని వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన పచ్చిది. ఇప్పటికైనా టాలీవుడ్ సమస్యను గుర్తించిందని అనుకోవచ్చు.
ప్రభుత్వంతో లొల్లి పెట్టుకోవాలని ఎవరూ అనుకోరు !
ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవాలని టాలీవుడ్ కు చెందిన ఏ ఒక్కరూ అనుకోరు. గ్లామర్ ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం చాలా అవసరం అందుకే ఇంకా ఎక్కువ గుడ్ లుక్స్ లో ఉండాలనుకుంటారు. అయితే అది ఎలా అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. యాక్సెస్ ఉన్న ఒకరిద్దరూ కాంగ్రెస్ పెద్దలతో టచ్ లోకి వెళ్లారు కానీ అది వారి వ్యక్తిగతం. టాలీవుడ్‌కు ఎలాంటి మేలు చేసే అవకాశం లేదు. అయితే ప్రభుత్వంతో ఎలా టచ్ లోఉండాలి… టాలీవుడ్ తరపున ఎవరు పెద్ద మనిషిగా ఉంటాయన్నది మాత్రం క్లారిటీ రాలేదు. అందుకే సమస్యలు వచ్చాయి.
దాసరి తర్వాత ఎవరూ లేకపోవడం సమస్య !
చిత్ర పరిశ్రమ తరపున ఏ సమస్య వచ్చినా పరిష్కారం చూపేందుకు దాసరి రెడీగా ఉండేవారు. తన సమయాన్ని వెచ్చించేవారు. ఆయన మాటలకు అందరూ విలువిచ్చేవారు. అయితే ఆయన తర్వాత ఇండస్ట్రీ తరపునఎవరూ పెద్ద లేరు. జగన్ ప్రభుత్వం నుంచి సమస్య వచ్చినప్పుడు చిరంజీవి ప్రయత్నించారు.ఆయనకు టాలీవుడ్ నుంచి సహకారం అంతంతమాత్రమే వచ్చింది. ఓ వర్గం నిష్ఠూరమాడింది. ఇండస్ట్రీ కోసం ప్రయత్నించి మాటలు పడాల్సిన అవసరం ఏముందని ఆయన కూడా వీలైనంతగా సైలెంటుగా గా ఉంటున్నారు.
దిల్ రాజుకి ఆ బాధ్యత ఇచ్చిన రేవంత్ రెడ్డి
ఇండస్ట్రీతో ప్రభుత్వానికి సమన్వయం ఉండాలని రేవంత్ రెడ్డి కూడా కోరుకుంటున్నారు. అందుకే గ్యాప్ ను పూడ్చడానికి కాంగ్రెస్ పార్టీకి ఏమీ చేయకపోయినా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని దిల్ రాజుకు ఇచ్చారు. ఆయన ఇప్పుడు పెద్ద మనిషి పాత్ర పోషించి అందర్నీ ఏక తాటిపైకి తీసుకువస్తున్నారు. ఇక ముందు తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి సమస్యలు వచ్చినా దిల్ రాజు పరిష్కరిస్తారు. ఏపీ ప్రభుత్వంతో అయితే చాలా మందికి డైరక్ట్ యాక్సెస్ ఉంటుంది. కానీ ఇండస్ట్రీ అంతర్గత సమస్యలను కూడా పరిష్కరించే ఓ పెద్ద మనిషి ఉంటేలా పరిశ్రమ సాఫీగా సాగిపోతుంది.