గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో దొరికిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం.. టాలీవుడ్ చుట్టూనే తిరుగుతోంది. బీజేపీ నేత, హైదరాబాద్లోని ప్రసిద్ధి రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటి అయిన మంజీర డైరక్టర్ అయిన గజ్జెల వివేకానంద అడ్డంగా దొరికారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు దొరికారు. మొత్తం ఐదుగురు అని ప్రచారం జరిగినప్పటికీ.. ఆ పార్టీలో కనీసం పది మంది పాల్గొన్నారని.. కొంత మంది తారలు కూడా డ్రగ్స్ పార్టీలో ఎంటర్టెయిన్ చేశారని స్పష్టం అయింది.
డ్రగ్స్ పార్టీకి హాజరైన వారిలో లిషి గణేష్ అనే నటి పేరు తెరపైకి వచ్చింది. ఆమె హై ప్రోఫైల్ ప్రైవేటు పార్టీలకు మోస్ట్ వాంటెడ్ అని భావిస్తున్నారు. లిషిగణేష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన పోలీసులు .. ఆమెకు నోటీసులు ఇవ్వనున్నారు. డ్రగ్స్ పార్టీకి లిషిగణేష్ వెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలులభించాయి. అలాగే శ్వేత అనే మరో వీఐపీ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ఉంది. లిషి గణేష్ సోదరి కుషిత కుళ్లపు సినిమాల్లో కూడా నటిస్తారు. వీరిపై గతంలో కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. లిషిగణేష్ను పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది.
హైదరాబాద్లో డ్రగ్స్ ను నిర్మూలించాలని.. సీఎం రేవంంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే హై ప్రోఫైల్ వ్యక్తులు… అత్యంత ఖరీదైన కొకైన్ తో… స్టార్ హోటల్స్ తో ఎవరికీ తెలియని విధంగా పార్టీలు చేసుకుంటున్నారు. ఈ రాకెట్ ను .. చేధించేందుకు పోలీసులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో గుట్టంతా బయటపడుతోంది. త్వరలో మరిన్ని సంచలనాలు ఈ డ్రగ్స్ కేసుల్లో వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.