పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం తీస్తున్న సర్దార్ సినిమా గురించి ఇక ఫ్యూచర్ లో జనసేన పార్టీ గురించి తదితర అంశాలతో కూడిన ఓ ఇంటర్వ్యూ రీసెంట్ గా ఓ జాతీయమీడియా ప్రతినిధి అనుపమ చోప్రాకు ఇవ్వడం జరిగింది. అయితే పవన్ సినిమా గురించి ఎప్పుడు ఎలాంటి న్యూస్ వస్తుందా అన్న ఉత్సాహంతో ఎదురుచూస్తున్న లోకల్ మీడియాను వదిలిపెట్టి జాతీయ మీడియాకు ఇవ్వడం పట్ల తెలుగు మీడియా పవన్ పై కోపంగా ఉందని తెలుస్తుంది.
సర్దార్ సినిమా విశేషాలతో పాటు తాను పూర్తిగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు అంశాలు ఆ ఇంటర్వ్యూలో ప్రస్థావించడం జరిగింది. అయితే పవర్ స్టార్ కు తెలుగు మీడియా మీద గౌరవం లేదా ఉంటే ఇక్కడ మీడియాతో కూడా ఓ ఇంటర్వ్యూ పెట్టొచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారు కొందరు. ఏది ఏమైనా పవర్ స్టార్ గురించి మరింత అప్డేట్ న్యూస్ తెలుసుకోవాలని ప్రయత్నించిన తెలుగు మీడియాకు ఎప్పుడు నిరాశే కలిగింది. మరి దీన్ని పవర్ స్టార్ గమనించి ఇక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇస్తే మంచిది లేదంటే వారి ఆగ్రహ జ్వాలకు గురవక తప్పదు.