ఓ మంచి సినిమానీ, మంచి ప్రయత్నాన్నీ అభినందించాల్సిందే. `భలే సినిమా తీశార్రా అబ్బాయ్లూ` అని మెచ్చుకొంటే ఆ చిత్రబృందానికి కొండంత విశ్వాసం పెరుగుతోంది. ఊపిరి సినిమాని టాలీవుడ్ మొత్తం భుజాన వేసుకొని నడిపిస్తోంది. గొప్ప సినిమా అని కొందరు.. క్లాసిక్ అని మరికొందరు కితాబులు ఇచ్చేస్తున్నారు. సినిమాలో విషయం ఉంది కాబట్టీ, ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు కాబట్టి… దాన్ని తప్పుపట్టలేం. ఇప్పుడు సావిత్రి సినిమా చూసి కూడా కొంతమంది కిందామీదా పడిపోతున్నార్ట. అమోఘం, అద్భుతం అని కీర్తిస్తున్నార్ట. తాజాగా కె.రాఘవేంద్రరావు సావిత్రి దర్శకుడు పవన్ సాదినేనికి ఫోన్ చేసి. మరీ అభినందించాడట. కథ, టేకింగ్, ఎమోషన్స్ అన్నీ బాగున్నాయని కితాబులు ఇచ్చాడట. నారా రోహిత్ పెర్‌ఫార్మ్సెన్స్ చూసి ఆ పెద్దాయన ముగ్థుడైపోయాడట.
ఆరిపోయిన దీపానికి ఇంకా వెలుగులేంటి?? ఈ సినిమా తొలిరోజుకే షెడ్డుకు వెళ్లిపోయింది. రొటీన్ కథని దర్శకుడు అంతే రొటీన్‌గా తీస్తే.. నటీనటులు చేయాలా వద్దా అంటూ ఆఫ్ మైండ్‌తో బండి లాగించే ప్రయత్నాలు చేశారన్నది ఈ సినిమా చూసినోళ్లందరికీ అర్థమయ్యే విషయం. అయినా సరే.. ఈ సినిమాని ఎలాగైనా బతికించుకోవాలని చిత్రబృందం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఇలా ప్రముఖులు ప్రశంసలు దక్కాయి అంటూ పాజిటీవ్ టాక్ కోసం అల్లాడిపోతోంది. ఇంత చేసినా లాభమేంటి?? ఈ జాగ్రత్తలేంటో సినిమా తీస్తున్నప్పుడే తీసుకొంటే.. ఇప్పుడు ఈ ప్రచారా ఆర్భాటాలు చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా?