టాలీవుడ్ లో మరో ప్రేమ జంట కథ ఇది. ఇద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. ఒకటి హిట్లూ. ఇంకోటి ఫ్లాపూ. ఇప్పుడు వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తూనే ఉన్నాయి. ఆ వార్తల్ని ఆ హీరో, హీరోయిన్ ఇద్దరూ ఖండించారు. కాకపోతే.. వ్యవహారం ముదిరింది. ఇద్దరూ నిజంగానే ప్రేమలో పడిపోయారు. రెండు కుటుంబాలూ వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే.. తప్పక.. ఒప్పేసుకొన్నారు. ఇప్పుడు ఈ మేటర్ నిశ్చితార్థం వరకూ వెళ్లిందని సమాచారం. ఈ యేడాదే… ఈ హీరో, హీరోయిన్లకు నిశ్చితార్థం జరగబోతోందని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడానికి ఫిక్సయ్యారని తెలుస్తోంది. దాంతో… ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. నిజానికి ఆ హీరోకి ఇది వరకు ఓ లవ్ మేటర్ ఉంది. హీరోయిన్ కూడా ఒకర్ని ప్రేమించి… సెండాఫ్ చెప్పి వచ్చేసింది. వాళ్ల బ్యాక్ స్టోరీలో.. లవ్ ఫెయిల్యూర్ ఉన్నా – వారిద్దరి ప్రేమకథని మాత్రం సుఖాంతం చేసుకోవాలని ఫిక్సయ్యారు.