చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి చిత్రీకరణలు నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ నిర్ణయించన సంగతి తెలిసిందే. గిల్డ్ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ మద్దతు తెలిపింది. అందరం కూర్చొని మాట్లాడుకుంటామని, పరిష్కారం దొరికే వరకూ షూటింగ్లను తిరిగి మొదలు పెట్టబోమని ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.
ఐతే ఇప్పుడా బంద్ పాక్షికమే అనిపిస్తుంది. సోమవారం కొన్ని సినిమాల షూటింగ్ జరిగాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా సిద్ధమవుతోన్న ‘వారసుడు’, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకీ అట్లూరి-ధనుష్ కాంబోలో రానున్న ‘సార్’ షూట్స్ యధావిధిగా నిర్వహించారు. బంద్ పై తమకు సమాచారం లేదని ఫిల్మ్ ఫెడరేషన్ చెబుతోంది. మిగతా కార్మికులు కూడా యధావిధిగా షూటింగులకు హాజరయ్యారు. బంద్ విషయంలో మొదటి నుండి ఏకాభిప్రాయం లేదనే మాట వినిపిస్తుంది. దిల్ రాజు నిర్మాతగా వున్న వారసుడు సినిమా షూటింగు సైతం జరగడం బంద్ పాక్షికమే అనే సంకేతాలు ఇస్తుంది.