కరోనా ఎఫెక్ట్‌తో చిత్రసీమ కకావికలం అయిపోయింది. ఈ దెబ్బ నుంచి ఎప్పుడు తేరుకుంటుందో తెలీదు. కాకపోతే సినిమా పరిశ్రమ మాత్రం బిఫోర్ కరోనా – ఆఫ్టర్ కరోనా అన్నట్టు ఉండడం ఖాయం. ఎన్నో మార్పులకు ఈ కరోనా కాలం బీజం వేయబోతోంది. టాలీవుడ్ ముందు పెను సవాళ్లు పెట్టబోతోంది. వాటిని పరిశ్రమ ఎలా ఎదుర్కుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
* భవిష్యత్తులో టాలీవుడ్ బడ్జెట్లు తగ్గడం ఖాయం. భారీ మల్టీస్టారర్లూ, పాన్ ఇండియా సినిమాలు చూడడం కష్టమే. బడ్జెట్లు ఎంత తగ్గితే సినిమాకి అంత మేలు.
* పారితోషికాలకూ కత్తెర వేసే అవకాశం ఉంది. టాలీవుడ్లో అగ్ర హీరో పారితోషికం ఇటీవల 50 కోట్లని తేలింది. ఇక ముందు ఇలాంటి అంకెలు చూసే అవకాశం చాలా కష్టం. బడ్జెట్ లు తగ్గించుకోవాంటే పారితోషికాల్లో భారీ కోత విధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతగా కాకపోతే… లాభాల్లో వాటా అనే ఆప్షన్ ఎలాగూ ఉంది.
* విదేశాల్లో షూటింగ్ అన్నమాటని కొంతకాలం మర్చిపోవాలి. కరోనా వల్ల టూరిజం బాగా తగ్గిపోతుంది. విదేశస్థుల్ని తమ దేశంలో అడుగుపెట్టనివ్వకుండా కొన్ని దేశాలు కఠినమైన చట్టాల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అమెరికాలాంటి దేశాల్లో వీసా దొరకడం ఇప్పుడు అసాధ్యమే అనుకోవాలి. సో.. కథలో ఫారెన్ లొకేషన్లు డిమాండ్ చేస్తే.. వాటిని నిర్దక్షణ్యంగా `కట్` చేయాలి.
* దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి. షూటింగులన్నీ ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తవ్వకపోతే.. నిర్మాతలకు చాలా నష్టం వాటిల్లుతుంటుంది. ఇది వరకు హీరో మూడ్ బాలేకపోయినా, దర్శకుడు అప్ సెట్ అయినా ఈజీగా పేకప్ చెప్పేసేవారు. ఇక మీదట ఇలాంటివి చెల్లవు.
* ఓటీటీలే ప్రధాన ఆదాయ వనరు అనుకుని సినిమా తీయడం బెటర్. థియేటర్ వ్యవస్థ ఎంత వరకూ నిర్మాతలకు తోడ్పాటు ఇస్తుందో ఇప్పుడైతే చెప్పలేం. కాకపోతే ఓటీటీ నుంచి మాత్రం రాబడి పెరుగుతుంది. వాటిని దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు మంచి అవకాశాలున్నాయి.
* థియేటర్లు తెరచుకోకపోతే.. వాటి వల్ల ఆధారపడి జీవిస్తున్న ఎన్నో బతుకులు రోడ్డుమీద పడతాయి. కేవలం సినిమాపైనే ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలి.
ఇవన్నీ టాలీవుడ్ ముందున్న సవాళ్లే. ఇవన్నీ వర్కవుట్ అవుతాయా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం.
థియేటర్లు తెరవకపోతే మాత్రం… కచ్చితంగా ఈ సవాళ్లని స్వీకరించాల్సి ఉంటుంది. కరోనా ప్రభావం తగ్గి, చిత్రసీమ మునుపటిలా ఉత్సాహవంతంగా పనిచే