కరోనా ప్రభావం ఎక్కువగా ఏ ఇండస్ట్రీ మీద ఉంది అంటే.. సినిమా రంగం మీద అని ఠక్కున చెప్పక తప్పదు. ధియేటర్లు పూర్తి స్థాయిలో ఈ మధ్యనే ప్రారంభమయ్యాయి. సినిమా రిలీజులు.. ఊపందుకుటున్నాయి. ఒక్కో వారం రెండు, మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ కరోనా వచ్చి పడుతోంది సెకండ్ వేవ్ వచ్చేసింది. దేశం మొత్తం అప్రమత్తమయింది. ఏదో ఒకటిచేయకపోతే ప్రభుత్వాలు… ప్రజలను కరోనాకు వదిలేశాయన్న విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అందుకే ప్రభుత్వాలు ఆంక్షల దిశగా చర్చలు ప్రారంభించాయి. మెట్రో నగరం ఉన్న తెలంగాణలో ముందుగా ఆంక్షలు విధించడం ఖాయంగా కనిపిస్తోంది.
సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొన్ని ఆంక్షలు విధించాల్సిందేనన్న ఆలోచనకు వచ్చారు. ఎలాంటి ఆంక్షలు విధించినా.. మొదటగాఅధికారలకు గుర్తుకు వచ్చేది సినిమాహాళ్లు మాత్రమే. సినిమా హాళ్లలో ఆక్యుపెన్సీని పరిమితం చేసే దిశగా తొలి నిర్ణయం తీసుకోవచ్చు. దీంతో పాటు ఫంక్షన్లలో పాల్గొనే జనంపైనా పరిమితులు విధించవచ్చు. కానీ… ఇక్కడ అసలు మొదటగా ఇబ్బంది పడేది.. సినిమాహాళ్లే. ఇప్పుడిప్పుడే కోలుకుటున్న సమయంలో… కరోనా ఆంక్షలు మరోసారి మూలిగేనక్కపై తాటిపండు పడేలా చేస్తాయనేది వారి ఆందోళన. ప్రస్తుతం ఎలాంటి ఆంక్,లు ప్రకటించలేదు. రేపోమాపో ప్రకటిస్తారు.
ముందుగా హైదరాబాద్ లో ఆంక్షలు విధిస్తే.. ఆటోమేటిక్గా ఇక తెలుగురాష్ట్రాలు మొత్తం విధిస్తారు. అంటే…మళ్లీ సినిమా పరిశ్రమపై బండపడినట్లే. మొదటిలాక్ డౌన్ అనుభవాలతో సెకండ్ వేవ్ వచ్చినా లాక్ డౌన్ విధించే అవకాశాలు లేవు కానీ.. ఆంక్షలు మాత్రం వినోద రంగాన్ని ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.