ఈరోజుల్లో ఓ హీరో స్టార్ అవ్వాలంటే దానికి బ్యాక్ గ్రౌండ్ చాలా అవసరం.. సరైన బ్యాక్ గ్రౌండ్ ఉంటే హీరోగా నిలదొక్కుకున్నట్టే. ప్రస్తుతం తన తనయుడిని స్టార్ హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు బెల్లంకొండ సురేష్. మొదటి సినిమా అల్లుడు శీనులో కుర్రాడు పర్వాలేదనిపించేలా చేసి సూపర్ అనిపించుకున్నాడు. ఇప్పుడు స్పీడున్నోడు అంటూ వచ్చి కేక పెట్టించేస్తున్నాడు. నిన్న జరిగిన స్పీడున్నోడు ఆడియో విడుదల కార్యక్రమంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అంతా అటెండ్ అవ్వడం విశేషం. వినాయక్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ కార్యక్రమంలో మొదటి సీడీ వినాయక్ విడుదల చేయడం జరిగింది.
ఇక మొదటి సినిమాలో నా ఇంటి పేరు సిల్కు.. నా ఒంటి పేరు మిల్కు అంటూ చిందులేసిన తమన్నా మరోసారి ఈ స్పీడున్నాడు సినిమాలో బ్యాచిలర్ బాబు అంటూ అదరగొట్టేసింది. ఇక సినిమా ఆడియోకి విడుదలకు కూడా తమన్న, రకుల్ ప్రీత్ సింగ్, రెజినా, హెభా పటేల్, కేథరిన్, సాక్షి చౌదరీ వచ్చి బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక సినిమా ట్రైలర్ తో నిజంగా ఈసారి హిట్ కొట్టేయడం ఖాయం అనేలా ఉన్నాడు శ్రీనివాస్ స్పీడ్ చూస్తుంటే.
భీమనేని శ్రీనివాస్ దర్శక నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా తమిళ సినిమా సుందర పాండియన్ కు రీమేక్ గా వస్తుంది. సోనారికా బడోరియా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు వసంత్ సంగీతం అందించాడు.