అబ్బూరి రవి.. బొమ్మరిల్లు నుంచి ఊపిరి వరకూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత. ఇప్పుడున్న స్టార్ రైటర్లలో ఆయన కూడా ఒకడు. ఇప్పుడాయన మేకప్ వేసుకుని నటుడిగా మారారు. `ఆపరేషన్ గోల్డ్ ఫిష్` సినిమా కోసం వినాయకుడు,కేరింత చిత్రాలతో ఆకట్టుకున్న సాయికిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఎయిర్ టెల్ 4జీ గాళ్ గా పాపులర్ అయిన శషా సెట్రి కథానాయికగా పరిచయం అవుతోంది. ఇందులో అడవి శేష్ ఓ స్టైలీష్ విలన్గా నటించనున్నాడు. దానికి తోడు… ఈ సినిమాకి సంభాషణలూ అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే… ఇందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు చిత్ర నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఏ ఒక్కరూ పారితోషికం తీసుకోలేదు. తమ పారితోషికాన్ని పెట్టుబడిగా మార్చుకున్నారంతే. సాయికుమార్ ఆది కథానాయకుడిగా నటిస్తున్నాడు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. రచయితలంతా దర్శకులు అవ్వడానికి రెడీ అవుతుంటే… అబ్బూరి రవి మాత్రం రూటు మార్చి.. నటుడయ్యాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో? ఆయన నటనా ప్రావీణ్యమేమిటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.