రాజసింహా… తెలుగు సినిమా రచయితగా తెలిసిన పేరే. దర్శకుడిగానూ నిరూపించుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ నిర్మాతపై తన కోపాన్ని డైరెక్ట్ గానే ప్రదర్శిస్తున్నాడు. ఈరోజు రాజసింహా చేసిన ఎఫ్.బీ పోస్ట్ చర్చనీయాంశం అయ్యింది. ఆయన నిర్మాత వివేక్ కూచిభొట్ల ఫొటో షేర్ చేస్తూ.. ఇతను నిర్మాతా? లేదంటే బ్రోకరా? అంటూ షాకింగ్ కామెంట్లు విసిరాడు. కొన్ని సినిమాలకు పని చేసిన ఓ కథా రచయిత ఇలా ఓ నిర్మాతని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై వివేక్ కూచిభొట్ల ఏం స్పందించలేదు కానీ…. వి.ఎన్.ఆదిత్య మాత్రం ఫైర్ అయ్యారు. ”నీకు బుద్ది లేదు.. విశ్వాస ఘాతకుడివి నువ్వు. వివేక్ అనే స్థాయి నీకు లేదు. తప్ప తాగి నీ కెరీర్ని చెడగొట్టుకొన్నావ్. కష్టపడి పైకి వచ్చినవాడి మీద ఏడవకు. నీకు ఆరోగ్యం బాగోకపోతే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు వీవేక్. ఈ కథ వినమని నిర్మాతలకు రికమెండ్ చేశారు. అలాంటి వ్యక్తిని అన్నావ్.. పర్యవసానాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండు” అంటూ ఫైర్ అయ్యారు. దాంతో రాజసింహా తిట్ట పురాణం వి.ఎన్.ఆదిత్యపై మళ్లింది. ‘నీ బతుకు నాకు తెలుసు. సింగర్ సునీతతో నడిపిన ఎఫైర్ నాకు తెలుసు’ అంటూ రాజసింహా మళ్లీ బూతులు ఎత్తుకొన్నాడు. అలా.. సోషల్ మీడియా సాక్షిగా.. వీరిద్దరూ రెచ్చిపోవడంతో ఆశ్చర్యపోవడం సినిమా వర్గాల వంతు అవుతోంది.
ఓ సినిమా ఛాన్స్ కోసం వివేక్ చుట్టూ తిరిగిన రాజసింహా… తనకు అవకాశం రాకపోయే సరికి ఇలా అక్కసు వెళ్లగక్కాడన్నది ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్న మాట. ఏది ఏమైనా ఓ నిర్మాతపై ఓ రచయిత ఇలా బహిరంగంగా ఓపెన్ అవ్వడం, ఓ దర్శకుడు ఇలా ఫైర్ అవ్వడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.