తెలుగువారి కలల రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టే గడియలు దగ్గరపడుతున్న తరుణంలో అమరావతి నిర్మాణ కార్యక్రమ సభా ప్రాంగణమంతా కోలాహలమైన ఏర్పాట్లతో ఒక పండుగ వాతావరణం నెలకొనివుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయని పాలెం గ్రామం వద్ద నవ్వాంధ్ర ప్రజా రాజధాని అమరావతి శంకుస్ధాపనకు ఏర్పాట్లనీ పూర్తయ్యాయి. విజయదశమి రోజున భారతప్రధాని నరేంద్రమోదీ అమరావతికి పునాది రాయి వేస్తారు.
గురువారంనాటి ఈ కార్యక్రమంలో ప్రధాన వేదిక మీద ప్రధానితోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్,జపాన్ మంత్రి మోటూ హయాషి,తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య,కేంద్రమంత్రులు అమితాబచ్చన్ వంటి ఒకరిద్దరు సెబ్రిటీలు సహా 15మంది ముఖ్య అతిధులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఆ వేదికకు ఇరువైపులా వివిధ కేంద్ర,రాష్ట్ర మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు ఆశీనులు అయ్యేందుకు వీలుగా మరో రెండు వేదికలను ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి హాజరు కానున్న నేపధ్యంలో సభా ప్రాంగణంతో పాటు ఆపరిసర ప్రాంతమంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ప్రధాని ప్రసగించే ప్రధాన సభావేదికను ఇప్పటికే కేంద్ర భద్రతా దళాలు ముఖ్యంగా ప్రధాని భద్రతా వ్యవహారాలను చూసే ఎస్పిజి(స్పెషల్ ప్రొటెక్సెన్ గ్రూపు) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంకుస్ధాపన కార్యక్రమానికి హాజరౌతున్న వారిలో పలుదేశాలకు చెందిన రాయబారులు (అంబాసిడర్లు), హైకమీషనర్లు ఉన్నారు. బంగ్లాదేశ్ హైకమీషనర్ అహ్మద్ తారీఖ్ కరీం, బెల్జీయం అంబసీ ప్రతినిధి పెట్కో డోయోకో, . వెనిజూలా రాయబారి అగుస్టో ముంటియల్ …ఇంకా కెనడా, రవండా హైకమీషనర్లు హాజరవుతున్నారు. జపాన్ ప్రభుత్వ అధీనంలోని జనరల్ ఆఫ్ ఎక్స్ టర్నల్ ట్రేడ్ ఆర్గనేజేషన్ చీప్ డైరెక్టర్ జనరల్ శ్రీ నయోషి నోగుచి హైదరాబాదులోని బ్రిటీష్ డిప్యూటీ కమీషనర్ అండ్రీ మెక్ మినిస్టర్, డిప్యూటీ హెడ్ అభిలాష్ పూళఖరా, మిసుబిష్ హెవీ ఇండ్రస్టీస్ చైర్మన్ మస్సూ యూకీ కుబో, సంస్ధ ముంబై జనరల్ మేనేజర్ సంజయ్ మున్ డ్లే, థాల్మియా సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గోనే పూనిత్, వాల్ మార్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రజనిష్ కుమార్, మార్గ్ లిమిటెడక్ కు చెందిన జి.ఆర్.కె.రెడ్డి, జియంఆర్కె గ్రూప్‌కు చెందిన జి.మల్లికార్జునరావు, రుచిసోయా ఇండ్రస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన కపిల్ జైన్, ప్రముఖ అంకాలజిస్ట్, ప్రవాస భారతీయుడు నోరి దత్తాత్రేయుడు, ఎస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ జీవన్ దాస్, హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ పవన్ చిల్లరిగె, అపోలో హాస్పటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి సహా పలు సాప్ట్ వేర్, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పరిశ్రమలు, ఎన్.జి.ఓ.లకు చెందిన ప్రతినిధులు 121 మంది హాజరవుతున్నారు.
కార్యక్రమానికి వచ్చే వివిధ ప్రముఖులు,ఇతర ప్రజాప్రతినిధులు,సెలబ్రిటీలు, మీడియా ప్రతినిధులు,సామాన్య ప్రజలు తదితరులకు సంబంధించి కూర్చునేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.అలాగే ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఆహ్వానితులందరికీ వేరువేరుగా ప్రత్యేక పాస్ లు జారీ చేయడమేగాక వారు ఏవిధంగా వారికి నిర్దేశించిన ప్రాంగణాలకు చేరుకోవాలనే దానిపై రూట్ మ్యాప్ లన కూడా పొందు పరచారు. శంఖుస్థాపన కార్యక్రమానికి విచ్చేసే అతిదులందిరికీ ఘనమైన ఆతిధ్యాన్ని అందించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం అందుకు సంబంధించిన వంటకాల తయారీ కార్యక్రమంలో నిపుణులు,పాకశాస్త్ర ప్రవీణులు నిమగ్నమై ఉన్నారు.