డ్రగ్స్ కేసు ఇప్పుడు బాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా హీరోయిన్లకు మాత్రం నిద్ర ఉండటం లేదు. ఇప్పటి వరకూ అరెస్టయిన వారిని విచారిస్తున్న సమయంమలో కొత్త కొత్త పేర్లు బయటికి వస్తున్నాయి. అన్నీ ప్రముఖ హీరోయిన్ల పేర్లే. సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్‌లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని.. వారికి ఈ వారంలోనే నోటీసులు ఇస్తామని అధికారులు మీడియాకు లీక్ అచ్చారు. సుశాంత్,రియా, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లు తరుచుగా పార్టీలు చేసుకుంటారని ఎన్సీబీ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
అనూహ్యంగా దీపికా పడుకొనే మేనేజర్‌కు కూడా.. ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ప్రముఖ హీరోయిన్ల పేర్లు తెరపైకి రావడంతో.. ఇక మీడియా ఆగడంలేదు. ఎన్సీబీ అధికారుల నుంచి వస్తున్న లీకులతో హడావుడి ేచస్తున్నారు. సుశాంత్ వద్ద పని చేసి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఓ వ్యక్తి వాట్సాప్ చాట్‌లో ఇద్దరు హీరోల పేర్లు ఉన్నాయని చెబుతున్నారు. డీ, కే అని ఉన్నాయని వారెవరో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. హీరోల పేర్లు మాత్రం.. డీ, కే అని చెబుతున్నారు కానీ.. హీరోయిన్ల విషయంలో మాత్రం… ఎన్సీబీ అధికారులు దూకుడుగా ఉన్నారు. వారి పేర్లను మీడియాకు లీక్ చేస్తున్నారు.
గత వారం రకుల్, సారాలపై అలాంటి ప్రచారమే చేశారు. తీరా రిపోర్టులో మాత్రం వారి పేర్లు లేవు. తర్వాత విచారణలో రియా వారి పేర్లు చెప్పిందని.. మళ్లీ ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు.. మెల్లగా కేసు దీపికా పదుకొనే వద్దకూ వెళ్తోంది. అయితే.. ఇదంతా మీడియా ట్రైల్ మాత్రమేనని.. అసలు ప్రచారం తప్ప.. ఈ కేసులో పస ఉండదని.. బాలీవుడ్ భావిస్తోంది. అయితే.. అందరిలోనూ టెన్షనే ఉంది.