క్షణాల్లో బ్రేకింగ్ వార్తలు అందిస్తాం..ప్రజా సమస్యలను వెలికితీస్తాం.. అని చెప్పుకునే ఓ ప్రధాన స్రవంతి మీడియా వైఖరిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా ఆ ఛానెల్ లో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంబంధించిన సమావేశాలు ఏమీ ప్రసారం కావడం లేదు. కేవలం జగన్ కు సంబంధించిన మీటింగ్స్ కు మాత్రమే కవరేజ్ ఇస్తుండటం మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
అయితే, సదరు చానెల్ ఉద్యోగులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీడియోలు వాడొద్దని పైనుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు వైసీపీ సమావేశాలు మాత్రమే ప్రసారం చేయాలని… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీటింగ్స్ కు ఏమాత్రం కవరేజ్ ఇవ్వొద్దని ఆదేశాలు అందినట్లుగా సమాచారం. ఆ కారణంగానే ఆ ఛానెల్ లో పూర్తిగా కూటమి సమావేశాలపై అప్రకటిత నిషేధం కొనసాగుతుందన్న ప్రచారం జరుగుతోంది.
తెలుగు మీడియాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాం. క్షణాల్లో జరిగే వార్తలను మీకందిస్తున్నాని గొప్పగా చెప్పుకుంటోంది ఆ ఛానెల్. అయినప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై దాడికి ప్రయత్నం జరిగితే ఆ అంశాన్ని ఎక్కడ కవర్ చేయకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ప్రజల కోసమే పని చేస్తాం అని చెప్పుకుంటూ..పెయిడ్ ఛానెల్ గా మారిందని నెటిజన్లు ఆ ఛానెల్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.