గోరంట్ల మాధవ్ వ్యవహారం పై వైసీపీ అధినేత జగన్ సైలెంట్‌గా ఉండటంతో ఆ పార్టీ పాత వ్యూహాన్ని మళ్లీ అమలు చేయబోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీకి ముందు నుంచీ ఓ అలవాటు ఉంది. తమకు ఇబ్బందికరంగా ఏదైనా పరిణామం సంభవించినప్పుడు వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తారు. అందు కోసం తెలుగుదేశం పార్టీ నేతల్ని అరెస్ట్ చేస్తారు. అమరావతి కుంభకోణాలు అంటూ నోటీసులు రెడీ చేస్తారు. ఇలాంటి వాటికి సీఐడీ రెడీగా ఉంటుంది. మీడియా అంతా.. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోతుంది. ఇంత కాలం జరిగింది అదే.
ఇప్పుడు హిందూపురం ఎంపీ అంశంలోనూ వైసీపీ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఎంపీపై చర్యలు తీసుకుంటామని .. సస్పెన్షన్ వేటు అని లీకులు ఇచ్చారు. కానీ అసలు అలాంటి ఆలోచనే వైసీపీ పెద్దలకు లేదు. అందుకే ఆయనను ఢిల్లీలో గౌరవంగానే చూసుకుంటున్నారు. అన్ని పార్టీ మీటింగ్‌లకూ పిలుపుస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ టాపిక్‌ను మరుగున పడేయడం ఎలా అనే దానిపై మేథోమథనం జరిపారు. టార్గెట్ చేయాల్సిన తెలుగుదేశం పార్టీ నేతలెవరో ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ అంశం పూర్తిగా మరుగునపడిపోయేలా టాపిక్ డైవర్షన్ ప్లాన్ అమలవుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రజలు ఏమనుకుంటారో అన్న ఆలోచన వైసీపీ పెద్దలకూ ఎప్పుడూ లేదు. అందుకే వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడూ అలాంటి ఆలోచన లేదు. అంబటి, అవంతి విషయంలో అయినా గోరంట్ల విషయంలో అయినా ప్రజలు ఏదో అనుకుంటారని .. వైసీపీ హైకమాండ్ ఆలోచించే పరిస్థితి లేదు. అయితే టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి మాత్రం పక్కా ప్లాన్ రెడీగా ఉంటుంది. ఇలాంటివి వైసీపీ పెద్దలకు కొట్టిన పిండి.