ఎమ్మెల్యే అయి నాలుగురున్నరేళ్లు అయింది అసలేమీ చేయలేకపోయినా నాకే తీవ్ర అసంతృప్తిగా ఉంది.. అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆవేదన చెందారు. తాను ఏమీ చేయలేకపోయాను అంటే.. కనీసం రోడ్లు కూడా వేయలేకపోయానని అర్థం. ఎందుకంటే.. తన సొంత ఊరికి కూడా రోడ్డు వేయలేదని నియోజకవర్గం మొత్తం ఎగతాళి చేస్తున్నారు. అందుకే ఆయన తన సొంత డబ్బులు పెట్టి తోపుదుర్తికి రోడ్డేస్తానని ప్రకటించారు. చెరువును కూడా సొంత డబ్బులతో బాగు చేస్తానని చెప్పుకొచ్చారు
నియోజకవర్గంలో రోడ్లు వేయకపోవడానికి కాంట్రాక్టర్లే కారణం అని.. ఆ కాంట్రాక్టర్లు పరిటాల సునీత బంధువులని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పరిటాల సునీత బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చారో లేదో కానీ.. ఆ పేరుతో కరపత్రాలు వేస్తానని తోపుదుర్తి చెబుతున్నారు. అసలు ఏమీ చేయలేదని.. ఆయనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకూ టిక్కెట్ లేదని చెబుతున్నారు. ఆ ప్రచారం ఆయన వరకూ రావడంతో.. ముందు జాగ్రత్తగా తాను ఏం చేయలేకపోయానని దానికి కారణం జగన్ రెడ్డి నిధులు ఇవ్వకపోవడమేనన్నట్లుగా సంకేతాలు పంపుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు రాప్తాడు టిక్కెట్ కావాలని ఆయన కోరుకుంటున్నారు. రాప్తాడులో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఆయనకు వైసీపీలో కూడా టిక్కెట్ లేదని తేలితే.. పట్టించుకునే వారు ఉండరు. వరుసగా ఓడిపోతున్నానని కుటుంబంతో కలిసి సెంటిమెంట్ రాజకీయాలు చేయడంతో గత ఎన్నికల్లో సానుభూతి ఓట్లు వేశారు. కానీ ఆయన ఈ ఐదేళ్లలో ్ంతకు మించిన ఓవరాక్షన్ చేయడం.. ఏ పనులూ చేయలేకపోవడంతో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.