తాబేలు, కుందేలు కథ తెలుసా? కుందేలుతో పోటీలో తాబేలే గెలిచిందట. ఈ ఫొటోలో ఉన్న తాబేలు మాత్రం కుందేలు అంత వేగం కాకపోయినా ఆ తరహాలో చకచకా నడుస్తుందట. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ వారే నిర్ధారించి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ తాబేలు పేరు బెర్టీ. ఇది గంటకు 0.6 మైళ్ల దూరం నడిచి కొత్త రికార్డు నెలకొల్పింది. 1977లో యూకేకు చెందని చార్లీ అనే తాబేలు నెలకొ్ల్పిన రికార్డును బద్దలుకొట్టింది.
గిన్నిస్ బుక్ ప్రతినిధి ఈ రికార్డును ఓకే చేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దీని యజమాని మార్కో కాల్జిని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. తన కల నిజమైందని, తన తాబేలు కుందేలులా, ఉసేన్ బోల్ట్ లా రికార్డు సాధించిందని చెప్తున్నాడు, ఈ తాబేలు నడకను చూసిన వారంతా 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్డ్ తో పోలుస్తున్నారు. మరి కొందరేమో దీన్ని కుందేలు లాంటి తాబేలని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఈ తాబేలు ఇప్పుడు రికార్డుల ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.